బైక్ ధరకే కారు.. లక్ష రూపాయల్లో మారుతి సుజుకీ

బైక్ ధరకే కారు.. లక్ష రూపాయల్లో మారుతి సుజుకీ
తక్కువ ధరలో మీకు నచ్చిన కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు.

కారులో షికారు చేయాలని ఉంది.. నలుగురికీ బండి సరిపోవట్లేదు.. ఎటన్నా వెళ్లాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అని వాపోతుంటారు. భార్యాభర్త ఇద్దరు పిల్లలున్న కుటుంబాల వాళ్లు. కానీ కొందామంటే మన బడ్జెట్లో లేదని వెనక్కి తగ్గుతుంటారు. అయితే అలాంటి వారి కోసమే మారుతీ సుజుకీ ట్రూ వ్యాల్యూ పేరుతో సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయిస్తోంది. ట్రూ వ్యాల్యూ డీలర్ షిప్ ద్వారా తక్కువ ధరలో మీకు నచ్చిన కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఆల్టో ఎల్‌ఎక్స్ఐ కారు ధర రూ.75 వేలు.. ఇది 2007 మోడల్. ఈ కారు ఢిల్లీలో అందుబాటులో ఉంది.

ఇది 85 వేల కిలోమీటర్లకు పైగా తిరిగింది. అలాగే ఆల్టో ఎస్‌టీడీ. ఇది 2008 మోడల్. దీని ధర వచ్చి రూ.91 వేలు. ఇది లక్షకు పైగా కిలో మీటర్లు తిరిగింది. మరొక కారు ఆల్టోఎల్ఎక్స్.. ఇది 2007 మోడల్. దీని ధర రూ.82 వేలు. ఇది కూడా 68వేల కిలోమీటర్లకు పైగా తిరిగింది. ఇవే కార్లు హైదరాబాద్‌లో కొనాలంటే లక్షా పదిహేను వేల వరకు పెట్టుబడి పెట్టాలి. ఆల్టో ఎల్ఎక్స్ 2006 మోడల్ రూ.1.5 లక్షలకు దొరుకుతుంది. ఆల్టోఎల్ఎక్స్ఐ కారు 2007 మోడల్ రూ.81 వేలకు, రిట్జ్ కారు 2016 మోడల్ రూ.1.6 లక్షలకు లభిస్తుంది. ఇక 2011 మోడల్ అయితే రూ.1.9 లక్షలు పెడితే ఈకో ఏసీ 5 సీటర్ కారు వస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story