భారీ నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు..!

భారీ నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు..!
ఇవాళ దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ ఔట్‌పెర్ఫామ్‌ చేయగా... బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ నష్టాలతో ముగిశాయి.

ఇవాళ దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ ఔట్‌పెర్ఫామ్‌ చేయగా... బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ నష్టాలతో ముగిశాయి. గత 9 నెలల్లో సింగిల్‌ డేలో ఈ స్థాయిలో మార్కెట్లు నష్టపోవడం ఇదే తొలిసారి. ప్రపంచ మార్కెట్ల సపోర్ట్‌ లేకపోవడంతో దేశీయ మార్కెట్ల సెంటిమెంట్‌ బలహీనపడింది. దీంతో ట్రేడింగ్‌ మొత్తం మీద సెన్సెక్స్‌ 1939 పాయింట్ల నష్టంతో 49100 వద్ద, నిఫ్టీ 568 పాయింట్ల నష్టంతో 14529 వద్ద ఇవాళ్టి ట్రేడింగ్‌ను ముగించాయి. ఇవాళ్టి సెషన్‌లో నిఫ్టీ-50లోని అన్ని స్టాక్స్‌ నష్టాలను నమోదు చేశాయి. ఇండియా ఒలటాలిటీ ఇండెక్స్‌ 22.9శాతం పెరిగి 28.14కు చేరింది. ఎన్‌ఎస్‌ఈలో 1324 స్టాక్స్‌ నష్టపోగా, 571 స్టాక్స్‌ లాభాలను నమోదు చేశాయి.

ముఖ్యంగా ఇవాళ్టి ట్రేడింగ్‌లో బ్యాంక్‌ నిఫ్టీ, ప్రైవేట్‌ బ్యాంక్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, ఫైనాన్షియల్‌ బ్యాంక్‌ స్టాక్స్‌ భారీ కరెక్షన్‌కు గురయ్యాయి. ఫార్మా మినహా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు నష్టాలను చవిచూశాయి. భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐలు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. ఓఎన్‌జీసీ 6.76శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 6.24శాతం, హీరోమోటోకార్ప్‌ 6.13శాతం, ఎంఅండ్‌ఎం 6.12శాతం, కోటక్‌ మహీంద్రా 6.07శాతం నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.

ఈవారం దేశీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. దీంతో ఈ నెల్లో ఈవారం అత్యంత చెత్త ప్రదర్శనను దేశీయ మార్కెట్లు నమోదు చేశాయి. యూనియన్‌ బడ్జెట్‌ తర్వాత దేశీయ మార్కెట్లు 5శాతం పైగా నష్టపోయాయి. ఆటో ఇండెక్స్‌ నెల రోజు కనిష్టానికి పడిపోయింది. దీంతో వారాంతాన మార్కెట్లు భారీ కరెక్షన్‌కు గురయ్యాయి. ఐటీ, బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌ భారీగా నష్టపోయాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 1790 పాయింట్లు, నిఫ్టీ 453 పాయింట్లు, బ్యాంక్‌ నిఫ్టీ 1038 పాయింట్లు నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ కూడా 1202 పాయింట్లు కోల్పోయి 24301 వద్ద ముగిసింది.

Tags

Read MoreRead Less
Next Story