Pallonji Mistry: వ్యాపార దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత..

Pallonji Mistry: వ్యాపార దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత..
Pallonji Mistry: వ్యాపార దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ (93) సోమవారం రాత్రి ముంబైలో కన్నుమూశారు.

Pallonji Mistry: వ్యాపార దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ (93) సోమవారం రాత్రి ముంబైలో కన్నుమూశారు. పల్లోంజి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు.

"శ్రీ పల్లోంజీ మిస్త్రీ మరణం విచారం కలిగించింది. వాణిజ్య ప్రపంచానికి ఆయన విస్తృత సేవలను అందించారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. పల్లోంజీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

1929లో జన్మించిన మిస్త్రీ పారిశ్రామికవేత్తగా చేసిన సేవలకుగానూ దేశంలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌తో సత్కరించారు. 2016లో అతనికి పద్మభూషణ్ లభించింది. 1865లో ముంబై ప్రధాన కార్యాలయంగా షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ స్థాపించబడింది. రియల్ ఎస్టేట్, వస్త్రాలు, ఇంజనీరింగ్ వస్తువులు, గృహోపకరణాలు, షిప్పింగ్, ప్రచురణలు, పవర్ మరియు బయోటెక్నాలజీ వంటి వాటిని డీల్ చేస్తుంది.

టాటా గ్రూప్‌లో మొత్తం 18 శాతానికి పైగా హోల్డింగ్‌తో మిస్త్రీ అతిపెద్ద వ్యక్తిగత వాటాదారు. అతని తండ్రి షాపూర్జీ పల్లోంజీ 1930లో టాటా సన్స్ షేర్లను కొనుగోలు చేశారు. పారిశ్రామికవేత్త మృతిపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ. ("పల్లోంజీ మిస్త్రీ , ఒక శకం ముగిసింది. అతని మేధాశక్తిని, పనిలో అతని సౌమ్యతను చూడటం జీవితంలో గొప్ప ఆనందాలలో ఒకటి. కుటుంబ సభ్యులకు నా సానుభూతి" అని మంత్రి పోస్ట్ చేసారు.

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేస్తూ: "షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఛైర్మన్ ష్ పల్లోంజీ మిస్త్రీ జీ తన పరిశ్రమకు మార్గదర్శకుడు. దశాబ్దాలుగా అతను చేపట్టిన ప్రాజెక్టుల పట్ల మక్కువ కలిగి ఉన్నాడు. అతని మరణం గురించి విని బాధపడ్డాను. అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను." అని ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story