GAS: వినియోగదారులకు షాక్: సిలిండర్ బుకింగ్‌పై కేంద్రం ఆంక్షలు

GAS: వినియోగదారులకు షాక్: సిలిండర్ బుకింగ్‌పై కేంద్రం ఆంక్షలు
X
గ్యాస్‌ సిలిండర్ బుకింగ్ గడువు 21 నుంచి 25 రోజులకు పెంపు... ఎల్‌పీజీ బ్లాక్ మార్కెటింగ్ అడ్డుకట్టకు కేంద్రం చర్యలు

దే­శం­లో వం­ట­గ్యా­స్ వి­ని­యో­గం, పం­పి­ణీ వ్య­వ­స్థ­లో కీలక మా­ర్పు­లు చే­స్తూ కేం­ద్ర ప్ర­భు­త్వం సం­చ­లన ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. ఎల్‌­పీ­జీ సి­లిం­డ­ర్ల నల్ల­బ­జా­రు­ను అరి­క­ట్ట­డం­తో పాటు, కృ­త్రిమ కొ­ర­త­ను ని­వా­రిం­చేం­దు­కు గ్యా­స్ బు­కిం­గ్ గడు­వు­ను పొ­డి­గిం­చిం­ది. సి­లిం­డ­ర్ బుక్ చే­సిన తర్వాత రెం­డో సి­లిం­డ­ర్ కోసం ఉన్న 21 రో­జుల ‘లా­కి­న్’ పీ­రి­య­డ్‌­ను 25 రో­జు­ల­కు పెం­చు­తూ ఉత్త­ర్వు­లు జారీ చే­సిం­ది.

బుకింగ్ గడువు పెంపునకు కారణాలివే..

సా­ధా­ర­ణం­గా ఒక సగటు కు­టుం­బా­ని­కి సి­లిం­డ­ర్ 45 నుం­డి 55 రో­జుల వరకు వస్తుం­ది. అయి­తే, అం­త­ర్జా­తీ­యం­గా చము­రు ధరలు పె­రు­గు­తుం­డ­డం, సర­ఫ­రా­లో అం­త­రా­యం కల­గ­వ­చ్చ­నే పు­కా­ర్ల నే­ప­థ్యం­లో వి­ని­యో­గ­దా­రు­లు భయాం­దో­ళ­న­ల­కు గు­ర­వు­తు­న్నా­రు. గతం­లో 55 రో­జు­ల­కో­సా­రి బుక్ చే­సే­వా­రు కూడా ప్ర­స్తు­తం 15 రో­జు­ల­కే రీ­ఫి­ల్ కోసం ప్ర­య­త్ని­స్తు­న్న­ట్లు ప్ర­భు­త్వం గు­ర్తిం­చిం­ది. ఇలా ముం­ద­స్తు­గా బుక్ చే­య­డం వల్ల ని­జం­గా అవ­స­ర­ము­న్న వా­రి­కి సి­లిం­డ­ర్లు దొ­ర­క­ని పరి­స్థి­తి ఏర్ప­డు­తోం­ది. దీ­ని­ని అరి­క­ట్టేం­దు­కే ప్ర­భు­త్వం ఈ 25 రో­జుల ని­బం­ధ­న­ను అమ­ల్లో­కి తె­చ్చిం­ది.

సామాన్యుడిపై ధరల భారం

ఒకవైపు నిబంధనలు కఠినతరం చేస్తూనే, మరోవైపు ధరల పెంపుతో వినియోగదారుల జేబుకు చిల్లు పడుతోంది.

గృహ వినియోగ సిలిండర్: ఇటీవల ఒక్కో సిలిండర్‌పై రూ. 60 భారాన్ని కేంద్రం పెంచింది.

వాణిజ్య సిలిండర్: కమర్షియల్ గ్యాస్ ధరను ఏకంగా రూ. 114.5 మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

గృహ వినియోగదారులకే అగ్రపీఠం

గ్యాస్ కొరత లేకుండా చూసేందుకు ఆయిల్ రిఫైనరీ కంపెనీలకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కమర్షియల్ వినియోగదారుల కంటే గృహ అవసరాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. దేశీయంగా గ్యాస్ డిమాండ్‌ను తట్టుకునేందుకు అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే వంటి దేశాలు గ్యాస్ సరఫరాకు ముందుకొచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

పెట్రోల్, డీజిల్ ధరలపై ఊరట

అం­త­ర్జా­తీయ మా­ర్కె­ట్‌­లో క్రూ­డ్ ఆయి­ల్ ధరలు పె­రు­గు­తు­న్న­ప్ప­టి­కీ, దే­శం­లో పె­ట్రో­ల్, డీ­జి­ల్ ధర­ల­ను ఇప్ప­టి­కి­ప్పు­డు పెం­చే ఆలో­చన లే­ద­ని కేం­ద్రం స్ప­ష్టం చే­సిం­ది. దే­శం­లో ప్ర­స్తు­తం సరి­ప­డా పె­ట్రో­ల్, డీ­జి­ల్ మరి­యు ఏటీ­ఎ­ఫ్ (వి­మాన ఇం­ధ­నం) ని­ల్వ­లు ఉన్నా­య­ని, కా­బ­ట్టి వా­హ­న­దా­రు­లు ఆం­దో­ళన చెం­దా­ల్సిన అవ­స­రం లే­ద­ని భరో­సా ఇచ్చిం­ది.

రెండు సిలిండర్ల బుకింగ్ మధ్య గడువు 25 రోజులకు పెంపు. ముందస్తు బుకింగ్‌ల ద్వారా జరిగే బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట.

విదేశీ దేశాల నుంచి ఎల్‌పీజీ దిగుమతికి ఒప్పందాలు. ప్రస్తుతానికి స్థిరంగా ఉండనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.

ఈ నిర్ణయాల వల్ల గ్యాస్ పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని, అనవసరమైన నిల్వలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

కేవలం బుకింగ్ గడువు పెంచడమే కాకుండా, పంపిణీ కేంద్రాల వద్ద స్టాక్ రిజిస్టర్లను డిజిటలైజ్ చేయడం ద్వారా పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

Tags

Next Story