SILVER: వెండే బంగారమాయెనా.!

దేశీయ బులియన్ మార్కెట్ లో వెండి ధరలు బుధవారం అమాంతం భారీగా పెరిగాయి. మార్చ్ సిల్వర్ కాంట్రాక్టులు దాదాపు 2 శాతం జంప్ చేసి కిలోకు రూ. 2,23,742 వద్ద కొత్త శిఖరాన్ని చేరుకుంది. ఇక స్పాట్ సిల్వర్ తొలిసారి ఔన్సుకు 70డాలర్లు దాటింది. 0.8శాతం లాభపడి 4,513.87 డాలర్లకు చేరింది. ఫలితంగా స్పాట్ సిల్వర్ వరుసగా మూడో రోజు లాభాల్లో కొనసాగుతున్నట్టు అయ్యింది. మరోవైపు బంగారం కూడా దేశీయ మార్కెట్ ఎంసీఎక్స్‌లో బుధవారం ఉదయం ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 0.42 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,38,469 వద్ద ఆల్‌టైమ్ హైని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తొలిసారి ఔన్సుకు 4,500 డాలర్లు దాటింది. స్పాట్ సిల్వర్ తొలిసారి ఔన్సుకు 70డాలర్లు దాటింది. 0.8శాతం లాభపడి 4,513.87 డాలర్లకు చేరింది.
ధరలు పెరగడానికి కారణాలు..
అమెరికా- వెనుజువెలా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆ దేశం నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్లను అమెరికా ఆపేయడంతో ఇరు దేశాల మధ్య బంధంపై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో డాలర్ ఇండెక్స్ కూడా పడుతూ వస్తోంది. ఫలితంగా “సేఫ్ హెవెన్”గా భావించే బంగారం, వెండివైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. వీటితో పాటు యూఎస్ ఫెడ్ రేట్ కట్పైనా అంచనాలు పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది కూడా వడ్డీ రేట్ల కోత ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది కూడా బంగారం, వెండి ధరల వృద్ధి కారణంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడుల ప్రవాహాలు కూడా బంగారం, వెండికి జోష్ ఇచ్చాయి. .బంగారం కన్నా వెండి విపరీతంగా పెరుగుతుండటం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఇయర్ ఆన్ ఇయర్ ప్రాదిపతికన బంగారం 76శాతం వృద్ధి చెందగా, వెండి మాత్రం ఏకంగా 140 శాతం కన్నా ఎక్కువ పెరిగింది. 1979 తర్వాత వెండికి ఇదే బలమైన ప్రదర్శన
ప్రపంచంలో నెం.3
పేదల బంగారంగా పేరుపడ్డ వెండి తాజాగా ప్రపంచంలోనే మూడో అత్యంత విలువైన పెట్టుబడి సాధనంగా మారింది. ప్రస్తుతం వెండి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా 4.04 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. యాపిల్ సంస్థను అధిగమించి మరీ వెండి ఈ ఘనతను సాధించింది. ప్రస్తుతం మార్కెట్ క్యాప్ పరంగా తొలి స్థానంలో బంగారం ఉండగా, రెండో స్థానంలో కంప్యూటర్ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా ఉంది.దూకుడులో బంగారాన్ని మించిపోయిన వెండి ధర నిన్నటితో పోలిస్తే నేడు ఏకంగా రూ.10 వేల మేర పెరిగింది. ప్రస్తుతం స్పాట్ మార్కెట్లో కిలో వెండి రూ.2,33,000 వద్ద ట్రేడవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ వెండి స్పాట్ ధరలు 72 డాలర్ల వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. నిన్నటితో పోలిస్తే ఇది 1.10 శాతం అధికం. ఈ వారంలో ఇప్పటివరకూ వెండి రేట్స్ 9.00 శాతం మేర పెరిగాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. పారిశ్రామిక రంగం నుంచి పెరిగిన డిమాండ్, భౌగోళికరాజకీయ అనిశ్చితులు వెరసి వెండికి భారీగా డిమాండ్ పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వెండి ధరలు భారీగా పెరగడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

