మ్యూచువల్ ఫండ్స్ లో 3.30 కోట్ల ఖాతాలు

మ్యూచువల్ ఫండ్స్ లో 3.30 కోట్ల ఖాతాలు

మ్యూచువల్ ఫండ్స్ లో 3.30 కోట్ల ఖాతాలుఆగస్టు 31 నాటికి మార్కెట్లో 3.30 కోట్ల సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్- SIP ఖాతాలున్నాయి. ఆగస్టులో కొత్తగా 11.16లక్షల కొత్త ఖాతాలు వచ్చాయి. జులైలో కూడా దాదాపు ఇదేస్థాయిలో ఉన్నాయి. దీంతో మొత్తం ఖాతాల సంఖ్య 3.30 కోట్లు దాటాయి. అయితే ఆగస్టులో రూ.7,792కోట్లు మాత్రమే వచ్చాయి. అయితే జులై కంటే స్వల్పంగా తగ్గాయి. జులైలో ఇది 7,831 కోట్లుగా ఉంది. మొత్తం SIP మార్కెట్ వాల్యూ 3.36 లక్షల కోట్లుకు పెరిగింది. గత నెల కంటే 17లక్షలు పెరిగాయి.

తాజాగా నెలకొన్న ఆర్ధిక పరిస్థితుల కారణంగా SIPలలో ఇన్వెస్ట్ తగ్గింది. రిటైల్ కస్టమర్లు చాలావరకు రిస్క్ ఫండ్స్ నుంచి తప్పుకుంటున్నారు. అయితే లాంగ్ టర్మ్ ఫండ్స్ లో మాత్రం బెటర్ ఇన్ ఫ్లోస్ ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో మొత్తం 42 కీ ఫండ్ మేనేజర్స్ టోటల్ గా రూ.27.2లక్షల కోట్ల నిధులను మూనేజ్ చేస్తున్నారు. జులైలో ఇది రూ.27.2లక్షల కోట్లుగా ఉంది.

మ్యుచువల్ ఫండ్ లో ఒకేసారి కాకుండా, నెలవారీగా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనినే సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ అంటారు. ఇందులో కనీసం మొత్తం రూ.500 కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. అన్నివర్గాల ప్రజలకు కూడా ఇది అందుబాటులో ఉంటుంది. బ్యాంకు ఖాతా నుంచి నేరుగా డెబిట్ చేసుకునే వెసులుబాటు ఉంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్న్ లో SIP భాగా పాపులర్ అయింది.

Tags

Read MoreRead Less
Next Story