Post Office Scheme: పీపీఎఫ్ స్కీమ్.. రోజుకు రూ.150 పొదుపు చేస్తే రూ.24 లక్షలు చేతికి..

Post Office Scheme: పీపీఎఫ్ స్కీమ్.. రోజుకు రూ.150 పొదుపు చేస్తే రూ.24 లక్షలు చేతికి..ప్రభుత్వరంగ సంస్థ.. పెట్టిన పెట్టుబడికి ఆర్థిక భద్రత.. సామాన్యులు సైతం నిరభ్యంతరంగా పొదుపు చేసుకునే అవకాశం.. పోస్టాఫీస్ అందిస్తున్న పలు రకాల స్కీములు. ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. ఆకర్షణీయమైన రాబడి ఉంటుంది. మీరు ఎంచుకునే స్కీమ్‌ని బట్టి మీకు లభించే బెనిఫిట్స్ ఉంటాయి.
పోస్టాఫీస్ అందించే పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF పీపీఎఫ్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో చేరితే రాబడి, రక్షణ, పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు అనేకం ఉంటాయి. పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. ఇష్టమైతే మరో ఐదేళ్లు మెచ్యూరిటీ పీరియడ్‌ని పెంచుకోవచ్చు.
సంవత్సరానికి కనిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ వస్తోంది. వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారే అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే మొత్తంపై కానీ, తీసుకునే మొత్తం పైన కానీ వడ్డీ ఉండదు.. పన్ను మినహాయింపు ఉంటుంది.
ఉదాహరణకు మీరు పీపీఎఫ్ స్కీమ్‌లో రోజుకు రూ.150 పొదుపు చేస్తూ నెలకు రూ.4500 పెట్టుబడి పెట్టాలని భావిస్తే.. 20 ఏళ్ల వరకు పెట్టుబడిని ఇలానే కొనసాగించినట్లైతే మెచ్యూరిటీ సమయానికి మీ చేతికి రూ.24 లక్షలు అందుతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com