Home
 / 
బిజినెస్ / నవంబర్‌లో కొత్త...

నవంబర్‌లో కొత్త మొబైల్స్.. మార్కెట్లో మరిన్ని మోడల్స్.. ఫీచర్స్

ఈ నెలలో వచ్చే దీపావళికి మరిన్ని కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి మార్కెట్లోకి

నవంబర్‌లో కొత్త మొబైల్స్.. మార్కెట్లో మరిన్ని మోడల్స్.. ఫీచర్స్
X

గ్యాడ్జెట్ ప్రియులకు మార్కెట్లో కొత్త మొబైల్స్ వచ్చిన ప్రతిసారీ పండగే.. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని కొత్త మోడల్స్ ఎన్నో వచ్చాయి. ఈ నెలలో వచ్చే దీపావళికి మరిన్ని కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి మార్కెట్లోకి. బేసిక్, బడ్జెట్, మిడ్ రేంజ్, ప్లాగ్‌షిప్ ఇలా వివిధ విభాగాల్లో కొత్త మొబైల్ మార్కెట్‌లోకి వస్తున్నాయి.

ఇక కొత్త మొబైల్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే మొదటగా మైక్రో‌మ్యాక్స్ గురించి చెప్పాలి. ఈనెల 3న మైక్రోమ్యాక్స్ 1, మైక్రోమ్యాక్స్ 1ఏ పేరుతో రెండు మొబైల్స్ లాంచ్ చేస్తారని సమాచారం. వన్ మొబైల్‌లో మీడియా టెక్ హీలియా జీ 35 ప్రాసెసర్‌తో పాటు వన్ ఏలో జీ 85 ప్రాసెసర్ ఉంటుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 ఎంపీ బ్యాక్ కెమెరా ఉంటుంది. ఇక వీటి ధర రూ.10 వేల నుంచి ప్రారంభమవుతుందని సమాచారం.

కెమెరా ప్రధానంగా వివో నుంచి రెండు మొబైల్స్ లాంచ్ చేస్తున్నారు. వాటిలో వివో వీ 20 ఎస్‌ఈ ఒకటి కాగా, వివో వి 20 ప్రో మరొకటి. థాయ్‌లాండ్‌లో రెండు నెలల క్రితం లాంచ్ చేసిన వివో వి 20ని మన దేశంలో వి20ఈ గా తీసుకొస్తున్నారని సమాచారం. మొదటివారంలోనే ఈ మొబైల్స్ వచ్చే అవకాశం ఉంది. స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ ఉండే ఈ మొబైల్‌లో 48 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. 8 జీబీ ర్యామ్, 12 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఉండే ఈ మొబైల్ ధర 20,990 అని తెలుస్తోంది. ఇక ఇందులోనే ప్రో వెర్షన్ ఇదే నెలలోనే వస్తుంది. ఈ నెలాఖరున మార్కెట్లోకి వచ్చే ఈ ఫోన్ వి20 ప్రోలో 5జీ నెట్‌వర్క్ సపోర్ట్ ఉండనుంది. అలాగే ఇందులో స్నాప్‌డ్రాగన్ 765జి ప్రాసెసర్ ఇస్తున్నారు. 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ ఆమెలెడ్ స్కీన్ ఉండే ఈ మొబైల్‌లో ముందు వైపు రెండు 44 ఎంపీ కెమెరాలు ఉంటాయి. 3 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసి 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరాతో మూడు కెమెరాల సెటప్ ఉంటుంది.

ఇక రియల్‌మీ ఈ నెలలో నాలుగు మొబైల్స్ లాంచ్ చేయబోతోంది. రియల్‌మి ఎక్స్ సిరీస్‌లో రెండు మొబైల్స్ రానుండగా, రియల్‌మి సీ 15ఎస్, సి17 మొబైల్స్ కూడా ఈ నెలలోనే వస్తాయని తెలుస్తోంది. ఎక్స్ సిరీస్‌లో ఎక్స్7, ఎక్స్ 7 ప్రో తీసుకొస్తున్నారు. వీటిలో మీడియా టెక్ డైమెన్ సిటీ చిప్ సెట్స్ ఉంటాయి. మన దేశంలో తొలిసారి ఈ ప్రాసెసర్లు తీసుకొస్తున్నారు. ఎక్స్ 7 ప్రోలో మీడియాటెక్ డైమెన్‌సిటీ 1000 ప్లస్ ప్రాసెసర్, ఎక్స్ 7లో డైమెన్‌సిటీ 800 యు ప్రాసెసర్ ఉంటుంది.

రియల్‌మీ 7 సిరీస్ మొబైల్స్ చైనాలో సెప్టెంబర్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఎక్స్ 7లో వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరాతో నాలుగు కెమెరాల సెటప్ ఉంటుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. 60 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఆమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో 4300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇక్ ప్రో వెర్షన్‌లో 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉండనుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేసే 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తారు.

రియల్‌మీ సి సిరీస్‌లో ఈ నెలలో రెండు స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. ఇటీవల వచ్చిన సి 15కి సక్సెసర్‌గా సి 15 ఎస్ తీసుకొస్తున్నారు. ఇది కాకుండానే సి 17 కూడా ఈ నెలలోనే వస్తోంది. 10 వేల కంటే తక్కువ ధరలో 90 హెడ్జ్ డిస్‌ప్లే రేటుతో మొబైల్ తీసుకొస్తామని సంస్థ చెబుతోంది. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌లో ఈ మొబైల్ లాంచ్ చేశారు. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీప్లస్ స్క్రీన్ ఉంటుంది. 6 జీబీ ర్యామ్, బ్యాక్‌సైడ్ నాలుగు కెమెరాల సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 460 ప్రాసెసర్ ఉంటుంది.

గతేడాది నవంబరులో రియల్‌మి నుంచి ఎక్స్ 2 ప్రో మొబైల్ వచ్చింది. సంవత్సరం అయిపోయిందిగా.. మరి ఎక్స్ 3 ప్రో రావాల్సిన సమయం వచ్చేసింది. ఇటీవల రియల్‌మి తీసుకొచ్చిన 125 అల్టా డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఈ మొబైల్స్‌లో ఉంటుంది. అలాగే 108 ఎంపీ కెమెరా కూడా ఉంటుందని తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్ 865 లేదా 865 ప్లస్ ప్రాసెసర్‌తో ఈ మొబైల్ మార్కెట్లోకి రానుంది. ధర రూ.30 వేలల్లో ఉండే అవకాశం ఉంది.

రెడ్‌మీ నోట్ 10 సిరీస్ 5 జీ కనెక్టివిటీతో రానుందని ప్రచారం సాగుతోంది. ఇందులో 120 హెడ్జ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 750జి ప్రాసెసర్, 4820 బ్యాటరీ ఉండొచ్చు. ఈ బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. నాలుగు కెమెరాలున్న ఈ ఫోన్ సెటప్‌లో ప్రధాన కెమెరా 64 ఎంపీ, ముందువైపు 16 ఎంపీ కెమెరా ఇస్తున్నారు.

దీపావళి సందర్భంగా మహిళా మణుల కోసం BE పేరుతో లావా ఓ ప్రత్యేక ఫోన్‌ని లాంఛ్ చేయనుంది. అతివలు మెచ్చే గులాబీ రంగులో, గ్లాసీ ఫినిష్‌తో ఉంటుంది. కానీ ధర మాత్రం వెల్లడించలేదు.

Next Story