తక్కువ ఖర్చుతో సోలార్ ప్యానల్ బిజినెస్.. 30 శాతం సబ్సిడీతో మంచి లాభాలు.

తక్కువ ఖర్చుతో సోలార్ ప్యానల్ బిజినెస్.. 30 శాతం సబ్సిడీతో మంచి లాభాలు.
చాలా మంది వ్యాపారం ప్రారంభించాలంటే ఎక్కడ నష్టంపోతామో అని భయపడుతుంటారు. అందుకే చాలమంది వ్యాపారం చేయాలంటే పెద్దగా ఆసక్తి చూపరు.

చాలా మంది వ్యాపారం ప్రారంభించాలంటే ఎక్కడ నష్టంపోతామో అని భయపడుతుంటారు. అందుకే చాలమంది వ్యాపారం చేయాలంటే పెద్దగా ఆసక్తి చూపరు. సొంత డబ్బులు ఉన్నవాళ్లు మాత్రమే వ్యాపార రంగంలో దిగుతుంటారు. మధ్య తరగతి జీవితాన్ని గడిపే వారు మాత్రం వ్యాపారం చేసేందుకు వెనకాడతారు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే లాభం సంగతి తరువాత ముందు పెట్టిన పెట్టుబడైనా వెనక్కి రాలేదంటే అడ్డంగా నష్టపోతాం అనుకుంటారు.

అందుకే ఏ వ్యాపారం ప్రారంబించాలన్నా ముందుగా దాని గురించి అవగాహన ఉండాలి. చేసే విధానం తెలిసి ఉండాలి. అయితేనే ఆ దారిలో సక్సెస్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని వ్యాపారాలకు పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు కాని వాటిలో లాభాలు మాత్రం భారీగా ఉంటాయి. అందులో ఒకటే సోలార్‌ ప్యానెల్స్‌ బిజినెస్. ఈ వ్యాపారాన్ని తక్కువలో తక్కువ రూ.70,000 ప్రారంభించవచ్చు.

ప్రస్తుతం ఈ సోలార్‌ ప్యానెల్స్‌ యొక్క డీలర్ ధర రూ.80 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు. దీనికోసం బ్యాంకుల నుంచి రుణం కూడా పొందవచ్చు. ప్రభుత్వం నుంచి సబ్సిడీ తర్వాత కేవలం రూ.60 నుంచి 70 వేలలో మొత్తం ఇన్‌స్టాల్‌ చేయొచ్చు. దీనికి కేంద్ర ప్రభుత్వమే కాకుండా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక సబ్సిడీని ఇస్తున్నాయి. అయితే మీ వద్ద పూర్తిగా డబ్బులు లేకపోతే బ్యాంకు నుంచి రుణం తీసుకుని కూడా వ్యాపారం ప్రారంభించవచ్చు. సోలార్‌ ప్యానెల్స్‌ కొనుగోలు చేయడానికి మీరు "పునరుత్పాదక ఇంధన అభివృద్ధి అథారిటీని" సంప్రదించాల్సి ఉంటుంది. దీని కోసం ప్రతి రాష్ట్ర రాజధాని మరియు ప్రధాన నగరాల్లో ఈ కార్యాలయాలు ఉంటాయి. అక్కడి నుండి అనుమతులు తీసుకొని ప్రైవేటు డీలర్ల నుంచి సౌర ఫలకాలను కూడా పొందవచ్చు.

ఇంటి పైకప్పు లేదా డాబా లకి సోలార్ ప్యానెళ్లు అమర్చుకోవాలి. మీరు ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్ల ద్వారా వచ్చే కరెంటును మీరు గ్రిడ్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేసుకుంటే మీకు తప్పకుండా మంచి ఆదాయం వస్తుంది. ఇందులో మీ పెట్టుబడికి 30 శాతం సబ్సిడీ కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలోని "పునరుత్పాదక ఇంధన శాఖ" సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునేవారికి ఈ సబ్సిడీ ఇస్తోంది. అందువల్ల మీరు రూ.లక్ష పెట్టి సోలార్ ప్యానెళ్లు తీసుకుంటే.. వాటికి రూ.30 వేలు డిస్కౌంట్ పొందవచ్చు.

సాధారణంగా ఈ సౌర ఫలకాలు జీవిత కాలం 25 సంవత్సరాలుగా ఉంటుంది. బ్యాటరీని కూడా కేవలం 10 సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీ ధర కూడా సుమారు రూ.20వేలు వరకి ఉంటుంది. ఈ ప్యానెల్స్‌ నుంచి ఉత్పత్తి చేయబడిన విద్యుత్‌ని మీ ఇంటి అవసరాలకి ఉచితంగా వినియోగించుకోవచ్చు. అలా వినియోగించాగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌ ద్వారా ప్రభుత్వానికి లేదా కంపెనీలకు విక్రయించుకోవచ్చు.

మీరు రెండు కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే.. 10 గంటల సూర్యకాంతికి సుమారు 10 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. అంటే.. ఒక నెలలో 300 యూనిట్ల. ఒకవేళ మీ ఇంటి అవసరాలకోసం కోసం 100 యూనిట్లు వినియోగించినా మిగిలిన 200 యూనిట్లను ప్రభుత్వానికి విక్రయించుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలో అక్కడ నిర్ణయించిన రేటు ప్రకారం మీకు చెల్లిస్తారు.Tags

Read MoreRead Less
Next Story