గోల్డ్ బాండ్స్ మళ్లీ వచ్చేస్తున్నాయి.. ధర ఫిక్స్

సావరీన్ గోల్డ్ బాండ్ ఎడిషన్ 10 వచ్చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇదో పదోసారి. జనవరి 11 నుంచి 15 వరకూ బాండ్లు అందుబాటులో ఉంటాయి. గ్రాము ధరను రూ.5104 వద్ద ఫిక్స్ చేసింది RBI. సాధారంగా గోల్డ్ బాండ్ ప్రైస్ ఫిక్స్ చేయడానికి ఓ రూల్ పాటిస్తారు. వరసగా మూడు రోజుల పాటు బంగారం ధర యావరేజ్ తీసుకుని దీనినే ఫైనల్ చేస్తారు. డిజిటల్ పేమెంట్ తో పాటు..ఆన్ లైన్ ద్వారా పర్చేజ్ చేస్తే రూ.50 డిస్కౌట్ ఇస్తారు. ఇటీవల 9వ సీరిస్ లో అప్పటి కంటే ఇప్పుడు తక్కువగా ఉంది. 5054గా ప్రకటించారు. సావరీన్ గోల్డ్ బాండ్స్ లో కనీసం 1 గ్రాము పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా 4కేజీల వరకూ అనుమతిస్తారు. వ్యక్తులు లేదా హిందు అవిబాజ్య కుటుంబ సంస్థలు వినియోగించుకోవచ్చు. ట్రస్టులు, కంపెనీలు అయితే 20 కేజీల వరకూ అనుమతిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com