Stock Market: భారీ నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు.. రూ.6 లక్షల కోట్లు..

Stock Market: గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్ లేకపోవడంతో ఇవాళ దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికా ద్రవ్యోల్బణం రేటు 4 దశాబ్దాల గరిష్టానికి చేరడం, పలు దేశాల కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీరేట్లను పెంచేందుకు సమాయత్తం అవుతుండటం, కోవిడ్ ఫోర్త్‌వేర్‌పై ఆందోళనలతో పాటు తదితర అంశాలు మన మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో దేశీయ మార్కెట్లు 3 వారాల కనిస్టానికి పడిపోయాయి. బ్యాంకింగ్, ఐటీ, మెటల్ స్టాక్స్ ఇవాళ్టి నష్టాలను లీడ్ చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్, టీసీఎస్‌లు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా ఉన్నాయి.
సెన్సెక్స్, నిఫ్టీలు కీలక సపోర్ట్ స్థాయిల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ 1వేల 457 పాయింట్లు నష్టపోయి 52వేల 847 వద్ద, నిఫ్టీ 427 పాయింట్ల నష్టంతో 15వేల 774 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా 1078 పాయింట్ల నష్టంతో 33 వేల 406 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. ఎన్‌ఎస్‌ఈలో అడ్వాన్స్, డిక్లైన్స్ విషయానికి వస్తే 181 స్టాక్స్ లాభపడగా 18వందల 5 స్టాక్స్ నష్టాలను చవిచూశాయి. ఇక నెస్లే, బజాజ్ ఆటోలు నిఫ్టీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ 7శాతం, బజాజ్ ఆటో, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హిందాల్కోలు 5శాతం చొప్పున నష్టపోయి నిఫ్టీ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com