స్టాక్‌ మార్కెట్లకు గురువారం సెలవు, బుధవారం సెలవు రద్దు

స్టాక్‌ మార్కెట్లకు గురువారం సెలవు, బుధవారం సెలవు రద్దు

బుధవారం స్టాక్ మార్కెట్ యథావిధిగా పనిచేయనుంది. బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లకు గురువారం సెలవు ప్రకటించారు. తిరిగి శుక్రవారం ఉదయం ప్రారంభం కానున్నాయి. ఇంతకు ముందు బక్రీద్ సెలవు బుధవారం నిర్ణయించారు. కానీ మళ్లీ స్థానిక మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో నిర్ణయం మార్చారు. ఈ మేరకు నేషనల్ స్టాక్‌ ఎక్స్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు సర్క్కులర్లు జారీ చేశాయి.

"మహారాష్ట్ర ప్రభుత్వం జూన్ 29న పబ్లిక్ హాలిడేగా నిర్ణయించింది. కావున ఇంతకుముందు ప్రకటించినట్లుగా జూన్ 28న బుధవారం రోజున సెలవు రద్దు చేయబడింది " అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

దీనికి అనుగుణంగా జూన్ 29న ఫారెన్ ఎక్స్ఛేంజ్‌, మనీ మార్కెట్లు, ప్రభుత్వ సెక్యూరిటీలలో ఎటువంటి లావాదేవీలు, సెటిల్‌మెంట్‌లు జరగవు. 29న జరగాల్సిన అన్ని లావాదేవీలు జూన్ 30న జరుగుతాయి అని పేర్కొంది

ఈ సెలవు తర్వాత వచ్చే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల సందర్భంగా మార్కెట్లకు సెలవు ప్రకటించారు.


Tags

Read MoreRead Less
Next Story