Rakshabandhan: ఆ రాఖీ ఖరీదు అక్షరాలా అయిదులక్షలు..

Rakshabandhan: ఆ రాఖీ ఖరీదు అక్షరాలా అయిదులక్షలు..
X
Rakshabandhan: గుజరాత్‌ సూరత్‌లోని ఒక దుకాణం అత్యంత ఖరీదైన రాఖీలను విక్రయించి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

Rakshabandhan: రక్షాబంధన్ సోదరుడు, సోదరి మధ్య అందమైన సంబంధాన్ని చూపించే ముఖ్యమైన పండుగ. రక్షాబంధన్ రోజున, సోదరి తన సోదరుడి మణికట్టుపై రాఖీని కట్టి, తన సోదరుడి నుండి రక్షణ వాగ్దానం తీసుకుంటుంది, ఆపై సోదరుడు ఆమెకు అభయమిస్తూ ఓ చిరు కానుకను కూడా బహుమతిని ఇస్తాడు. ఈ పండుగను దృష్టిలో ఉంచుకుని దేశంలోనే అత్యంత ఖరీదైన రాఖీలను గుజరాత్‌లోని సూరత్‌లో తయారు చేస్తారు.

రంగు రంగుల రాఖీలతో మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. వ్యాపారస్తులు కస్టమర్‌లను ఆకర్షించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పండుగ సమీపిస్తున్న తరుణంలో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ దుకాణం కొన్ని ప్రత్యేకమైన రాఖీలను తయారు చేసింది. దారపు రాఖీలు మొదలుకొని బంగారం, వెండి, ప్లాటినం, వజ్రాలు పొదిగిన రాఖీల వరకు షాపు యజమానులు విక్రయిస్తున్నారు. అత్యంత ఖరీదైన ఈ రాఖీల విలువ లక్షల్లో ఉంది. అన్నిటికంటే అతి ఎక్కువ ధర పలుకుతున్న రాఖీ రూ.5 లక్షలు. ఈ రాఖీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది.

నగల దుకాణం యజమాని దీపక్ భాయ్ చోక్సీ మీడియాతో మాట్లాడుతూ, "మేము తయారుచేసిన రాఖీలను రక్షాబంధన్ తర్వాత ఆభరణాలుగా కూడా ధరించవచ్చు" అని చెప్పారు. ఈ షోరూమ్‌లో బంగారం, వెండి మరియు ప్లాటినంతో వివిధ రకాల రాఖీలు తయారు చేసి కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ షోరూమ్‌లో రక్షాబంధన్ పండుగ కోసం రూ.400 నుంచి రూ.5 లక్షల వరకు రాఖీలను సిద్ధం చేశారు.

Tags

Next Story