ఈ స్టాక్స్ లో లక్ష పెడితే ఇప్పుడు 3.05లక్షలు అయ్యాయి

ఈ స్టాక్స్ లో లక్ష పెడితే ఇప్పుడు 3.05లక్షలు అయ్యాయి
టాటా సన్స్ గ్రూపునకు చెందిన TATA Elxsi షేర్లు రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. మార్చి 25 నుంచి ఇప్పటివరకూ ఏకంగా 206శాతం పెరిగాయి. మూడు రెట్లు పెరిగింది..

టాటా సన్స్ గ్రూపునకు చెందిన TATA Elxsi షేర్లు రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. మార్చి 25 నుంచి ఇప్పటివరకూ ఏకంగా 206శాతం పెరిగాయి. మూడు రెట్లు పెరిగింది ఈ షేరు, మార్చి 25న దేశీయ స్టాక్ మార్కెట్లు పతనం అయ్యాయి. అత్యంత దారుణమైన పడిపోయాయి. ఆ సమయంలో కంపెనీ షేరు కూడా 52 వారాల కనిష్టస్థాయికి పడిపోయింది. మళ్లీ ర్యాలీలో షేరు పెరుగుతూ వచ్చింది. మార్చిలో రూ.501గా ఉంది. ప్రస్తుతం ఇది రూ.1500కు పైగా ట్రేడ్ అవుతోంది. సరిగ్గా చెప్పాలంటే మార్చి 25న ఇందులో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినవారికి ఆక్టోబర్ 15 నాటికి అంటే 7 నెలల కాలంలో రూ.3.05 లక్షలు అయింది. అంటే నెట్ ప్రాఫిట్ రూ.2.05లక్షలు.

TATA Elxsi షేరు పెరగడానికి పనితీరు కూడా కారణం. సంస్థ రెండో త్రైమాసికానికి నెట్ ప్రాఫిట్ ఏకంగా 58శాతం పెరిగింది. మొత్తం రూ.78.9కోట్లు లాభం చూపించింది. గత ఏడాది ఇదే కాలానికి రూ.49.8కోట్లు మాత్రమే. ఆదాయం 430.2 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికానికి 385.8 కోట్లు మాత్రమే. కంపెనీ డిజైన్ అండ్ టెక్నాలజీ సంస్థ. ఇంజినీరింగ్, బ్రాడ్ కాస్ట్, కమ్యూనికేషన్, ఆటోమాటీవ్ రంగాల్లో సేవలు అందిస్తోంది. కొత్త ఉత్పత్తులు, విక్రయాలు, సర్వీస్ రంగాల్లో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story