టాటా మోటార్స్ నుంచి మరో వాహనం ' మ్యాజిక్ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్'

టాటా మోటార్స్ ఈ రోజు భారతదేశంలో 'మ్యాజిక్ ఎక్స్‌ప్రెస్ పేషెంట్ ట్రాన్స్‌పోర్ట్ అంబులెన్స్'ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ వాహనం వైద్య ఆరోగ్య సంబంధిత సేవలకు తోడ్పడేలా రూపొందించబడింది. దేశం మొత్తం కరోనా సంక్షోభం వంటి సమస్యాత్మక సమయాల్లో పయనిస్తున్నందున టాటా మ్యాజిక్ ఎక్స్‌ప్రెస్ ఎకానమీ అంబులెన్స్ ప్రవేశపెట్టడం రోగులకు ఊరటనిచ్చే అంశం.
స్వదేశీ తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ క్రమం తప్పకుండా కొత్త వాహనాలను విడుదల చేస్తోంది. మేజిక్ ఎక్స్‌ప్రెస్ మనం తరచూ ఎదుర్కొనే ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుందని, రోగులకు అత్యవసర సేవలు అందించేందుకు సాయపడుతుందని టాటా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్రొడక్ట్ లైన్, ఎస్సీవీ & పియు వైస్ ప్రెసిడెంట్ వినయ్ పాథక్ మాట్లాడుతూ
" మ్యాజిక్ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్ ప్రవేశంతో, టాటా మోటార్స్ ఉత్తమ ఆరోగ్య సంరక్షణ నిబద్ధతను నెరవేరుస్తుంది. టాటా మ్యాజిక్ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్‌లో ఆటో-లోడింగ్ స్ట్రెచర్, రోగులకు అవసరమయ్యే మెడికల్ క్యాబినెట్, అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలిండర్, డాక్టర్ సీటు, ఫైర్‌ని నిలువరించేందుకు అవసరమైన అత్యవసర పరికరాలు ఉన్నాయి.
ఇది AIS 125 సర్టిఫైడ్ రెట్రో-రిఫ్లెక్టివ్ డెకాల్స్ మరియు సైరన్ తో బెకన్ లైట్ కలిగి ఉంది. పనితీరు విషయానికొస్తే, ఇది 800 హార్స్ పవర్, 110 ఎన్ఎమ్ టార్క్ యొక్క గరిష్ట శక్తి ఉత్పత్తిని అభివృద్ధి చేసే 800 సిసి టిసిఐసి ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.
సుదీర్ఘకాలం పనిచేస్తున్న మ్యాజిక్ ఆర్కిటెక్చర్ ఆధారంగా, కొత్త టాటా మ్యాజిక్ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్‌కు 2 సంవత్సరాలు లేదా 72,000 కిలోమీటర్ల వారంటీ లభిస్తుంది ఇది ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు, ఎన్జీఓ వంటి ఆరోగ్య సంరక్షణ విభాగాలకు ఈ వాహనం అనువైనదని సంస్థ తెలియజేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com