టాటా మోటార్ కార్లు.. భారీ డిస్కౌంట్‌లో..

కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో, టాటా మోటార్స్ మార్చి నెలలో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. స్వదేశీ వాహన తయారీదారు తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని వెల్లడించిడిస్కౌంట్ల జాబితాను విడుదల చేసింది. ఇవి టియాగో, టైగోర్, నెక్సాన్ మరియు 5-సీట్ల హారియర్‌తో సహా ఎంచుకున్న కార్లపై రూ. 65,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
టాటా కార్లపై ఈ ఆఫర్ మార్చి 31, 2021 వరకు వుంటుంది. ఆల్ట్రోజ్, ఫ్లాగ్‌షిప్ సఫారి ఎస్‌యూవీ ఈ ఆఫర్లలో భాగం కాదు. ఇంకా ఎక్సేంజ్ ఆఫర్ కూడా ఉన్నట్లు సంస్థ తెలియజేసింది. టియాగోకారు రూ.25,000 వరకు పరిమిత కాల ఆఫర్‌తో ఆకర్షిస్తుంది.
ఇందులో వినియోగదారుల పథకం మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్ వరుసగా రూ.15,000, రూ.10,000 ఉన్నాయి. టైగర్ సెడాన్ మొత్తం బెనిఫిట్స్ రూ.30,000 ప్రయోజనాలతో వెబ్‌సైట్‌లో చేర్చబడింది.
నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఇచ్చే డిస్కౌంట్ రూ.15,000 వరకు ఉంటుంది. ఎస్‌యూవీ డీజిల్ వేరియంట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో మాత్రమే లభిస్తుంది. మరో ముఖ్యగమనిక నెక్సాన్ యొక్క పెట్రోల్ ఉత్పత్తులపై ఎటువంటి ఆఫర్లు లేవు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com