Tata Nexon XZ+(L) : మార్కెట్లోకి టాటా నెక్సాన్ కొత్త వేరియంట్.. ఫీచర్లు, ధర..

Tata Nexon XZ+(L): ప్రముఖ వాహన తయారీ దారు టాటా మోటార్స్ టాటా నెక్సాన్ కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. టాటా నెక్సాన్ ఎక్స్‌జెడ్ +(ఎల్) వేరియంట్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. సరికొత్త ఫీచర్లతో లాంచ్ చేసిన కారు ధరను రూ.11.37 లక్షలుగా నిర్ణయించింది.
పెట్రోల్, డీజిల్ వెర్షన్‌లతో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. కొత్త టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ ధర రూ.11,37,900 (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)
ఇంజన్, ఫీచర్లు..
1.2 లీటర్ టర్బోచార్జ్డ్ రెవోట్రాన్ పెట్రోల్, 1.5 లీటర్ రెవోటార్క్ టర్బో డీజిల్ ఇంజన్లను అందిస్తుంది. ఒక ఇంజన్ గరిష్టంగా 129 PS పవర్ అవుట్‌పుట్, 170 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండోది 110 PS, 260 Nm లను విడుదల చేస్తుంది.
వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయం, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ఫ్యూరిఫైయర్, ఆటో డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లతో ఈ కారు లభ్యం అవుతుంది. ఇంకా కొత్త XZ+(L) వేరియంట్ నెక్సాన్ డార్క్ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది. కాగా ప్రస్తుతం అత్యంత సరసమైన ధరలో ఎలక్ట్రిక్ వాహనం టాటా టియాగో ఈవీని వచ్చే వారం భారతదేశంలో విడుదల చేయడానికి టాటా మోటార్స్ సన్నహాలు చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com