23 Nov 2022 10:57 AM GMT

Home
 / 
బిజినెస్ / Tata Tigor: వాహన...

Tata Tigor: వాహన ప్రియులను ఆకర్షిస్తున్న టాటా 'టిగోర్'.. ధర, ఫీచర్లు చూస్తే..

Tata Tigor: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ తన టిగోర్ ఈవీ సెడాన్ కారుకు సరికొత్త హంగులద్ది మార్కెట్‌లోకి విడుదల చేసింది.

Tata Tigor: వాహన ప్రియులను ఆకర్షిస్తున్న టాటా టిగోర్.. ధర, ఫీచర్లు చూస్తే..
X

Tata Tigor: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ తన టిగోర్ ఈవీ సెడాన్ కారుకు సరికొత్త హంగులద్ది మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కారులో ప్రయాణం మరింత సుఖంగా, సౌలభ్యంగా ఉండేందుకు న్యూఫర్ ఎవర్ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది.


ఇందులో భాగంగా టాటా మోటార్స్ తన కార్లను ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి అప్‌డేట్ చేయనుంది. తాజాగా టిగోరో ఈవీ పెడాన్ కారును మార్పులు చేసి మార్కెట్లోకి తీసుకువచ్చింది.

ప్రీమియం కార్లలో లేటెస్ట్ టెక్నాలజీని జోడిస్తూ టిగోర్ ఈవీ రేంజ్ ఎక్స్‌టెండ్ చేసింది. దీంతో కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. దీంతోపాటు మల్టీమోడ్ రీజెన్, రిమోట్ సాయంతో కారును లాక్, అన్‌లాక్ చేసేలా జెడ్ కనెక్ట్ టెక్నాలజీ, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, టైర్ పంచర్ రిపేర్ కిట్, ఇంకా అడ్వాన్స్‌డ్ సిస్టం.మెథడ్, డిజైన్ వంటి టెక్నలాజికల్లీ అడ్వాన్స్‌డ్ అనుభూతిని కలిగించేలా ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Next Story