Sugar Cosmetics Vineeta Singh : రూ. కోటి జీతం వద్దనుకుని వ్యాపారం.. వినీతా సింగ్ సక్సెస్ స్టోరీ

Sugar Cosmetics Vineeta Singh : రూ. కోటి జీతం వద్దనుకుని వ్యాపారం.. వినీతా సింగ్ సక్సెస్ స్టోరీ
Sugar Cosmetics Vineeta Singh : మహిళలు తమ చర్మానికి సరైన సౌందర్య సాధనాలను ఎంపిక చేసుకోవడంలో ఎప్పుడూ ఇబ్బంది పడతారు.

Sugar Cosmetics Vineeta Singh : కోటి రూపాయల జీతం.. వింటేనే ఊపిరి ఆగిపోయేలా ఉంది. అయినా వద్దనుకుంది.. ఒకరి కింద పని చేస్తేనే కోటి వస్తుంది.. అదే సొంతంగా ఓ వ్యాపారం చేస్తే కొన్ని వందల మందికి ఉపాధి కల్పించొచ్చు. ఆలోచన ఎంత బావుంది.. ఆలస్యం చేయకుండా ఆచరణకు అడుగులు వేసింది.. షుగర్ కాస్మొటిక్స్ స్థాపించి మహిళల అందానికి మరిన్ని సొబగులు దిద్దుతోంది వినీతాసింగ్.

నేటి మహిళలు అత్యంత శక్తివంతులు. వారు తమ కలలను నెరవేర్చుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇల్లాలి బాధ్యతలను చక్కబెడుతూనే తమ అభిరుచులకు అనుగుణంగా వ్యాపార రంగంలోనూ అడుగుపెడుతున్నారు. అనుకున్నది సాధిస్తున్నారు.

కాస్మెటిక్స్ రంగంలోకి ప్రవేశించి తనదైన మార్కు వేసి కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్న వినీతా సింగ్‌ జర్నీ.. స్వదేశీ బ్రాండ్ షుగర్ కాస్మెటిక్స్‌లో సహ వ్యవస్థాపకురాలు వినీత. గత 2-3 సంవత్సరాల నుండి మహిళా పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిస్తోంది.

వినీత ఐఐటీ మద్రాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఐఐఎం అహ్మదాబాద్‌లో తన బిజినెస్ స్టడీస్‌ని కొనసాగించింది. తన కోర్సు ముగిసే సమయానికి వినీత స్వంతంగా ఓ స్టార్టప్‌ను ఏర్పాటు చేయాలని గట్టిగా ప్లాన్ చేసింది. అందుకోసం ఆమెకు క్యాంపస్ సెలక్షన్స్‌లో కోటి రూపాయల వేతనంతో వచ్చిన ఉద్యోగ ప్రతిపాదనను తిరస్కరించింది.

"మహిళలను ప్రధాన కస్టమర్‌గా ఊహించుకుని మొదటి స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు కౌశిక్‌తో కలిసి బ్యూటీ సబ్‌స్క్రిప్షన్ కంపెనీని ప్రారంభించింది. 2015లో డైరెక్ట్-టు-కన్స్యూమర్ మేకప్ బ్రాండ్‌గా SUGAR కాస్మెటిక్స్‌ కంపెనీని ప్రారంభించింది.

మహిళలు తమ చర్మానికి సరైన సౌందర్య సాధనాలను ఎంపిక చేసుకోవడంలో ఎప్పుడూ ఇబ్బంది పడతారు. ఇదే అంశంపై ఫోకస్ చేస్తూ.. వినీత కేవలం ఇండియన్ స్కిన్ టోన్‌ల కోసం మేకప్ ఉత్పత్తులను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇవి భారతదేశంలోనే తయారు చేయబడతాయి.20-35 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలను లక్ష్యంగా చేసుకుని, Instagram, Facebook, Youtubeతో సహా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించగలిగినందున చక్కెర సౌందర్య సాధనాలకు మార్కెట్‌లో బాగా డిమాండ్ ఉంది.

కంపెనీ ఇప్పుడు నెలకు దాదాపు 650,000 ఉత్పత్తులను విక్రయిస్తోంది. వారి యాప్ 1 మిలియన్ డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. ఇన్‌స్టాగ్రామ్ పేజీకి మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దేశంలోని 130కి పైగా నగరాల్లో ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లు ఉన్నాయి.

వినీత్, కౌశిక్ చేయి చేయి కలిపి పని చేస్తూ బెస్ట్ కపుల్స్ అని నిరూపించుకున్నారు. ఏది చెయ్యాలన్నా కొంత రిస్క్ తప్పనిసరిగా ఉంటుంది.. కష్టం వచ్చిందని కృంగిపోకూడదు. కృషితో పాటు సంకల్పం గట్టిగా ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా అవలీలగా అధిగమించొచ్చు అని చెబుతారు షుగర్ కాస్మెటిక్స్ అథినేత్రి వినీత.

Tags

Read MoreRead Less
Next Story