Property Sales: గ్రేటర్ లో డిమాండ్ ఎక్కువగా ఉన్న గృహాలు

Property Sales: గ్రేటర్ లో డిమాండ్ ఎక్కువగా ఉన్న గృహాలు
Property Sales: నగరంలో ఇల్లు కొనుక్కోవాలన్న మధ్యతరగతి వాసి కల నెరవేరుతోంది.. దాదాపు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ఉండే గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.

Property Sales: నగరంలో ఇల్లు కొనుక్కోవాలన్న మధ్యతరగతి వాసి కల నెరవేరుతోంది.. దాదాపు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ఉండే గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. గత నెలలో విక్రయమైన గృహాలలో 53 శాతం ఈ తరహా ఇళ్లే కావడం గమనార్హం. గత ఏడాది ఇదే నెలలో 34 శాతం పెరుగుదల ఉండగా.. ప్రస్తుతం వాటి డిమాండ్ 53 శాతానికి పెరిగింది.

అయితే ఇదే సమయంలో రూ.25లోపు ధర ఉన్న గృహాలకు డిమాండ్ తగ్గింది. ఈ తరహా ఇళ్లు గత ఏడాది 43 శాతం అమ్ముడు పోగా ప్రస్తుతం వాటి డిమాండ్ తగ్గి 15 శాతానికి పడిపోయింది. కరోనా కారణంగా ఇంటి వద్ద ఉండి పని చేసే వారి సంఖ్య ఎక్కువ కావడం, ఇంటి వాతావరణం అందుకు అనుకూలంగా లేకపోవడంతో కొనుగోలు దారులు ముందుకు రావడం లేదు రూ.25 లక్షల లోపు ధర ఉన్న ఇళ్లను కొనుగోలు చేయడానికి అని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇక 50 నుంచి 70 లక్షల రూపాయలు ఉన్న ఇళ్ల కొనుగోళ్లు 11 నుంచి 13 శాతానికి పెరగ్గా, రూ.75 లక్షల పైన ఉన్న లగ్జరీ ఇళ్ల వాటా 17 శాతానికి పెరిగింది.

విశాలంగా ఉన్న ఇళ్లను కోరుకుంటున్న కొనుగోలు దారులు..

కరోనా, వర్క్ ఫ్రం హోమ్, ఆన్ లైన్ క్లాసుల నేపథ్యంలో ఇంటి విస్తీర్ణాలు పెరిగాయి. వినియోగదారుల కోరిక మేరకు ఇంటి విస్తీర్ణాన్ని పెంచుతూ గృహాలు నిర్మిస్తున్నారు రియల్టర్లు.. ఈ ఏడాది ఏప్రిల్ లో గృహ విక్రయాలలో హైదరాబాద్ వాటా 15 శాతం కాగా, మేడ్చల్-మల్కాజ్ గిరి 44 శాతం, రంగారెడ్డి 40 శాతం, సంగారెడ్డ 1 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

హైదరాబాద్ స్థిరాస్థి మార్కెట్ ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం వంటి ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. పెరిగిన నిర్మాణ వ్యయం కారణంగా ప్రాపర్టీ ధరలు పెరుగుతున్నప్పటికీ వినియోగదారుల మీద అంతగా ప్రభావం చూపడం లేదు. ఉపాధి భద్రత, పొదుపులలో పెరుగుదల కారణంగా ప్రాపర్టీలకు గిరాకీ పెరిగింది.

Tags

Read MoreRead Less
Next Story