Anand Mahindra : గురు సౌరభ్ టాలెంట్ కి ఆనంద్ మహీంద్రా ఫిదా..!

Anand Mahindra : సోషల్ మీడియాలో ఆసక్తికరమైన, అద్భుతమైన విషయాలను పంచుకోవడంలో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పుడు ముందుంటారు. పంచుకోవడమే కాదు అవసరం అయితే సహకరం కూడా అందిస్తుంటాడు ఆయన.. తాజాగా ఓ టాలెంటెడ్ పర్సన్ కి అండగా నిలిచారు ఆనంద్ మహింద్రా... ఇప్పుడు మార్కెట్ లోకి లక్ట్రిక్ వెహికల్స్, ఇన్నోవేషన్స్ రోజుకోటి వస్తోంది కానీ సైకిల్ కి ఉన్న ఆదరణ ఇంకా తగ్గలేదు.
ఇప్పటికి దేశంలో 53 శాతం మంది ప్రజలు సైకిల్ ని తమ వాహనంగా వాడుతున్నారు. అయితే వాడుతున్న సైకిల్‌కి పెద్దగా ఆల్ట్రేషన్ చేయకుండానే ఈవీ వెహికల్‌గా మార్చే అద్భుతమైన డివైజ్‌ని గురు సౌరభ్ తయారు చేశారు. దీనికి సంబంధించిన వీడియోని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్ గా మారడంతో ఆనంద్ మహింద్రా దృష్టిని ఆకర్షించింది.
ఇంతకీ దీని ప్రత్యేకతలు ఏంటంటే.. ఈ సింపుల్ డివైజ్‌తో సైకిల్ ఈవీ వెహికల్‌గా మారిపోతుంది. 170 కేజీ బరువు మోసుకెళ్లగలుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఫైర్ , వాటర్, మడ్ ప్రూఫ్ కూడా. 20 నిమిషాల పాటు పెడల్స్ తొక్కితే దీని బ్యాటరీ 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. అందుకే ఆనంద్ మహీంద్రా అతనికి అండగా ఉండేందుకు ముందుకు వచ్చాడు. గురు సౌరభ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తానంటూ తనంతట తానుగా ప్రకటించాడు. అంతేకాకుండా గురు సౌరభ్ యొక్క ఆవిష్కరణ అనివార్యంగా వాణిజ్యపరంగా విజయం సాధిస్తుందని మహీంద్రా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com