Income tax: ఇల్లు కొనాలనుకుంటున్నారా.. అయితే ఏప్రిల్ 1 లోపు..

Income tax: ఇల్లు కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మార్చి 31లోపు ఆలోచించడం మంచిది.. ఎందుకంటే మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి ఆదాయపు పన్ను చట్టం 1960 సెక్షన్ 80ఈఈఏ కింద లభించే ఆదాయపు పన్ను ప్రయోజనం ఏప్రిల్ 1, 2022 నుంచి నిలిచిపోనుంది.
2019 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఇల్లు కొనుగోలు చేసేవారికి సహాయపడేందుకు ఈ మినహాయింపును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత బడ్జెట్ 2020. 2021 వరుసగా మరో ఏడాదిపాటు పొడిగిస్తూ వచ్చింది. కానీ, 2022 బడ్జెట్ లో దీనిపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు.
అందువల్ల మార్చి 31, 2022 లోపు హౌసింగ్ లోన్ శాంక్షన్ అయిన్ వారికి మాత్రమే ఈ అదనపు ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్రయోజనం వర్తించకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆదాయపు పన్ను చట్టం కింద గృహ రుణం వడ్డీ చెల్లింపులపై రూ.1.50 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. ఉదాహరణకి ఇంటి లోను కింద వడ్డీ ఏడాదికి రూ.3.50 లక్షలు చెల్లిస్తుంటే సెక్షన్ 80ఈఈఏ కింద రూ.1.50 లక్షలకు క్లెయిమ్ చేసుకోవచ్చు. సెక్షన్ 24 (బి) ప్రకారం రూ. 2లక్షలు క్లెయిమ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎవరు అర్హులు..
మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసిన పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
రుణం మంజూరు చేసిన తేదీ నాటికి పన్ను చెల్లింపుదారుని పేరుపై ఎటువంటి నివాస గృహ ఆస్తి ఉండకూడదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com