ఈ రోజు బంగారం ధరలు.. పసిడి ధర స్థిరంగా.. వెండి ధర వేగంగా

ఈ రోజు బంగారం ధరలు.. పసిడి ధర స్థిరంగా.. వెండి ధర వేగంగా
బంగారం ధర ఇలా ఉంటే వెండి రేటు మాత్రం పైకి కదిలింది.

ఈ రోజు మార్కెట్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. కానీ వెండి మాత్రం పరుగులు పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా, వెండి ధరలు వేగంగా కదులుతున్నాయి.

హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఈ రోజు కూడా ఎలాంటి మార్పు లేదు. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.48,290 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,250 వద్ద స్థిరంగా ఉంది.

బంగారం ధర ఇలా ఉంటే వెండి రేటు మాత్రం పైకి కదిలింది. వెండి ధర కిలోకు రూ.700 పెరిగి ప్రస్తుత ధర రూ.74,600కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీ దారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.02 శాతం తగ్గుదలతో 1822 డాలర్లకు క్షీణించింది. ఇక వెండి విషయానికి వస్తే ఔన్స్‌కు 1.88 శాతం పెరుగుదలతో 27.84 డాలర్లకు చేరింది.

పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Tags

Read MoreRead Less
Next Story