మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. తగ్గినట్టే తగ్గి..

గత నెలలో రూ.44,000 దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్ ఈ నెలలో రూ.46,000కు పైనే కదలాడుతోంది. అంతర్జాతీయ పరిణామాలు, కరోనా సెకండ్ వేవ్, ఈక్విటీ మార్కెట్ల పతనం వంటి వివిధ అంశాలు బంగారానికి ఊతమిస్తున్నాయి. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైం గరిష్టం రూ.56,200తో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.9500 తక్కువగా ఉంది. గత నెలలో ఓ సమయంలో రూ.12400 తక్కువగా ఉంది. ఈ కాలంలో రూ.3 వేలు పెరిగింది. వెండి ధరలు కూడా కిలో రూ.67,000కు పైన ఉంది. నేడు ఓ సమయంలో రూ.68,000ను క్రాస్ చేసింది.
ఇకపోతే వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.200.00 (0.30%) పెరిగి రూ.67838.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,708 వద్ద ప్రారంభమై, రూ.68,060.00 గరిష్టాన్ని, రూ.67,705.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.268.00 పెరిగి రూ.68905.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,783.00 వద్ద ప్రారంభమైన ధర రూ.69.085.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,770.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు పెరిగాయి. మళ్లీ 1750 డాలర్ల దిశగా కదులుతోంది. 6.75 (0.39%) డాలర్లు పెరిగి 1,743.05 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,7345.45-1,742.85 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా పెరిగి 0.069 డాలర్లు తగ్గి 25.593 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.383-25.665 డాలర్ల మధ్య కదలాడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com