గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి..!

గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. షాకిచ్చిన  వెండి..!
Gold and Silver Rates Today: వివిధ నగరాల్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. నిన్న ఒక్కరోజు బంగారం రూ.490 తగ్గింది.

Gold and Silver Rates Today: బంగారం ధరలు వరుస నాలుగో రోజు కూడా తగ్గాయి. నిన్నటి ప్రారంభ ధరతో పోలిస్తే ఈ రోజు(10-08-2021 మంగళవారం) బంగారం ధరలు ఎలాంటి పెరుగుదల నమోదు చేసుకోలేదు. నిన్న(09-08-2021) రూ.43,840గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ 43,350గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,830గా ఉండగా, ఈ రోజు రూ47,300గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,800ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,780గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,280 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,280ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,600ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,750ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,350ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,300ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 43,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,300ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ47,300ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే.. వెండిధరలు పెరిగాయి. నిన్న ప్రారంభ ధరతో పోలిస్తే భారీగా పెరిగాయి. నిన్న(09-08-2021 సోమవారం) ప్రారంభ ధరలతో పోలిస్తే కేజీ వెండి రూ.3,700 పెరిగింది. ఈ రోజు(10-08-2021 మంగళవారం) వెండి 10 గ్రాములు రూ.687గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 68,700గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (10-08-2021 మంగళవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story