23 July 2021 1:27 AM GMT

Home
 / 
బిజినెస్ / Gold and Silver Rates...

Gold and Silver Rates Today: వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన పసిడి ధరలు..పెరిగిన వెండి!

Gold and Silver Rates Today: రెండు రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుదల కనిపించాయి. మరోవైపు వెండి ధరలు ఈ రెండు రోజుల్లో 4వేల రూపాయలుపైగా పెరిగిగాయి.

Gold Rates and Silver Rates Today
X

Gold and Silver Rates Today

Gold and Silver Rates Today: బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గింది. ఈ రెండు రోజుల్లో బంగారం ధరలు రూ.770 వరకు తగ్గాయి. నిన్నటి ప్రారంభ ధరతో పోలిస్తే ఈ రోజు(23-07-2021 శుక్రవారం) బంగారం ధరలు రూ. 380 తగ్గుదల కనిపించింది. నిన్న(22-07-2021) రూ.44,900గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ44,550గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,980గా ఉండగా, ఈ రోజు రూ 48,600గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,010గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,900ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,050 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,750ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,600ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,600ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే.. ఒకవైపు బంగారం ధరలు తగ్గుతుంటే.. మరోవైపు వెండిధరలు పైపైకి పెరిగిపోతున్నాయి. ఈ రోజు వెండి ధరలు కాస్త పెరిగాయి. నిన్న(22-07-2021 గురువారం) ప్రారంభ ధరలతో పోలిస్తే కేజీ వెండి రూ 4.00 పెరిగింది. ఈ రోజు(23-07-2021 శుక్రవారం) వెండి 10 గ్రాములు రూ.719గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.71,900గా ఉంది. మంగళవారం రూ.5.400 తగ్గిన వెండి.. బుధ,గురువారాల్లో 4వేల 4వందలు పెరిగింది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (23-07-2021శుక్రవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Next Story