మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు..వెండి ధర మాత్రం..

Today gold Price and silver price Gold Rates and Silver Rates 22nd  july hyderabad Vijayawada chennai

Today gold Price and silver price

Gold and Silver Rates Today: గత రెండు రోజులుగా తగ్గతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. మరోవైపు సిల్వర్ ధరలు కూడా బంగారం ధరలకు పోటీ ఇస్తున్నాయి.

Gold and Silver Rates Today: రెండో రోజులుగా తగ్గిన బంగారం ధరలు కాస్త పెరిగాయి. నిన్నటి ప్రారంభ ధరతో పోలిస్తే ఈ రోజు(24-07-2021 శనివారం) బంగారం ధరలు రూ. 170 పెరుగుదల కనిపించింది. నిన్న(23-07-2021) రూ.44,550గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ 44,700గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,600గా ఉండగా, ఈ రోజు రూ48,770గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,060 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,160గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,870 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,870ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,250 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,950ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,700ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,770ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,770ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,700ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ48,770ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే.. వెండిధరలు పైపైకి పెరిగిపోతున్నాయి. ఈ రోజు వెండి ధరలు కాస్త పెరిగాయి. నిన్న(23-07-2021 శుక్రవారం) ప్రారంభ ధరలతో పోలిస్తే కేజీ వెండి రూ 400 పెరిగింది. ఈ రోజు(24-07-2021 శనివారం) వెండి 10 గ్రాములు రూ.723గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.72,300గా ఉంది. మంగళవారం రూ.5.400 తగ్గిన వెండి.. ఈ మూడు రోజుల్లో 4వేల 8వందలు పెరిగింది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (24-07-2021శనివారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story