Gold Price Today: బంగారం కొనేవారికి ఇదే మంచి అవకాశం.. ధరలు భారీగా..

Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. గత కొద్ది రోజులుగా పసిడి రేటు రాకెట్ మాదిరిగా దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు సడెన్ గా బ్రేక్ పడింది. కేవలం ఒక్కరోజులోనే బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చమురు ఉత్పత్తిని పెంచనున్నట్లు ప్రకటించడం, రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు ఒక కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తుండడంతో మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని నిపుణులు పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం 0.58 శాతం లేదా రూ. 309 తగ్గి 10 గ్రాములకు రూ. 52,930 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, బంగారంతో పాటు వెండి ఫ్యూచర్స్ ధరలు కూడా ఈరోజు అంటే శుక్రవారం తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఈ రోజు అంటే శుక్రవారం క్షీణతతో ట్రేడవుతున్నాయి. బంగారంతో పాటు వెండి ఫ్యూచర్స్ ధర కూడా తగ్గింది. MCXలో వెండి ధర కిలోకు రూ. 70,126 వద్ద ట్రేడవుతోంది.
భారతీయ మార్కెట్లో బంగారం ధర ఒక్కరోజులో సుమారు 2వేలకు పైగా పడిపోవడం విశేషం. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.2050కి పైగా తగ్గి రూ.52,230కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.49,723 నుంచి రూ.47,843కు చేరుకుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి.
నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల పసిడి ధర రూ.49,800 నుంచి రూ.48,200 తగ్గింది. అంటే ఒక్క రోజులో రూ.1600 లు తగ్గింది. ఇక బిస్కెట్ గోల్డ్ బంగారం ధర రూ.1750 తగ్గి రూ.52,580కి చేరుకుంది. వెండి ధర రూ.3వేలకు పైగా తగ్గి రూ.68,837 కి చేరుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com