Gold Rate: బంగారం ధర.. నిన్నటి కంటే ఈ రోజు స్వల్పంగా..

Gold Price: గ్లోబల్ మార్కెట్లలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, భారతదేశంలో మంగళవారం బంగారం ధరలు తక్కువగా ట్రేడవుతున్నాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో, గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ .33 తగ్గి రూ. 47,392 వద్ద ట్రేడవుతున్నాయి. గత ముగింపు రూ. 47425 కి భిన్నంగా ఉన్నాయి. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 117 లేదా 0.18 శాతం తగ్గి రూ. 65,175 వద్ద ఉన్నాయి. గత సెషన్‌లో, సిల్వర్ ఫ్యూచర్స్ రూ. 65,292 వద్ద ముగిశాయి. ప్రపంచవ్యాప్తంగా, పసుపు మెటల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. స్పాట్ బంగారం ఔన్స్‌కు 0.2 శాతం పెరిగి 1,826.75 డాలర్లకు చేరుకుంది. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3% తగ్గి 1,828.00 డాలర్లకు చేరుకుంది.
మూడు వారాల వ్యవధి తర్వాత, MCX సిల్వర్ ధర రూ. 64000 కంటే ఎక్కువగా ట్రేడవుతోంది. రాబోయే రోజుల్లో 67,500 స్థాయిలకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఆగస్టులో రికార్డు స్థాయిలో బంగారం దిగుమతి అయింది. ఆగస్టు 2021 లో భారతదేశం 121 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇది గత 5 నెలల్లో అత్యధికం. ఆగస్టు 2020 లో, భారతదేశం 63 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. రాయిటర్స్ ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరగడం వలన భారతదేశంలో బంగారం దిగుమతి విపరీతంగా పెరిగింది.
ఈరోజు బంగారం రేటు
ఈ రోజు ముంబైలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 46,530.
ఢిల్లీలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 46,660.
చెన్నైలో బంగారం రేటు 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 44,790.
కోల్‌కతాలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 46,950.
బెంగళూరులో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 44,510.
హైదరాబాద్‌లో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 44,510.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com