పెట్రో బాదుడు..ఈ రోజు కూడా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో నిత్యం మారుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు ఝలక్ ఇస్తున్నాయి. దేశ వ్యాప్తంగా వాహనదారులపై పెట్రో బాదుడు కొనసాగుతోంది. గత తొమ్మిది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుబంటుండడంతో వాహనాలు బయటకు తీయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
హైదరాబాద్‌లో గురువారం(18-02-2021) లీటర్ పెట్రోల్ ధర రూ.93.10గా ఉంది. కాగా హైదరాబాద్‌లో బుధవారం(17-02-2021) లీటర్ పెట్రోల్ ధర రూ.92.84గా ఉంది. అదే సమయంలో హైదరాబాద్‌లో గురువారం(18-02-2021) లీటర్ డీజిల్ ధర రూ.87.20గా ఉంది. కాగా హైదరాబాద్‌లో బుధవారం(17-02-2021) లీటర్ డీజిల్ ధర రూ.86.93 గా ఉంది.
ఇక దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.54గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 79.95గా ఉంది.
ఇక కొలకత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.78గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.83.54గా ఉంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.00గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 86.98 గా ఉంది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.68గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.85.01గా ఉంది.
బెంగుళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.54గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 84.75గా ఉంది.
ఒడిశా లో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.25గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.87.12గా ఉంది.
విజయవాడ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.86గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.89.42గా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com