దడ పుట్టిస్తోన్న పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో మునుపెన్నడూ లేనంతగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. పావలా.. పావలా చొప్పున పెరుగుతున్న ఇంధన ధరలు తెలియకుండానే వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. రికార్డు స్థాయిలో లీటరు పెట్రోలు ధర దడ పుట్టిస్తోంది. పెట్రోలు బాటలోనే డీజిల్ కూడా భగ్గుమంటోంది.
హైదరాబాద్‌లో గురువారం లీటర్ పెట్రోల్ ధర రూ. 89.77గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 83.46 గా ఉంది.
ఇక దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 86.30గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 76.48గా ఉంది.
ఇక కొలకత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 87.69గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.80.08గా ఉంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.86గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 83.30 గా ఉంది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.82గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.81.71గా ఉంది.
బెంగుళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.21గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 81.10గా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com