Petrol and Diesel Price: పెరిగిన పెట్రోల్.. డీజిల్ ధరలు..

Petrol and Diesel Price: పెరిగిన పెట్రోల్.. డీజిల్ ధరలు..
Petrol and Diesel Price: రెండు నెలలుగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

Petrol and Diesel Price: మరోసారి పెట్రోల్ కాస్త ధరలు పెరిగాయి. రెండు నెలలుగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ ఏడాది లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలకు చేరి షాకిస్తే.. ఇక రూ.100 మార్క్ క్రాస్ చేయడానికి పెద్ద టైం కూడా పట్టలేదు. దీంతో వాహనదారులపై అధిక ప్రభావం పడింది. అంతేకాకుండా సామాన్యులపై కూడా ఎఫెక్ట్ పడుతోంది.

పెట్రోల్ ధరలో ఈరోజు స్వల్పంగా పెరిగింది. బుధవారం ఇంధన ధరలు రూ.105.15 వద్ద స్థిరంగా కొనసాగాయి. గురువారం 37 పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.105.52 దాటేసింది. ఇక డీజిల్ ధర రూ.99.54 వద్ద కొనసాగుతోంది. విజయవాడలోనూ డీజిల్ ధర రూ.99.54 చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.107.20, డీజిల్ 27 పైసలు తగ్గి రూ.97.29 వద్ద ఉంది.

చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.23, లీటర్ డీజిల్ రూ.94.24, కోల్‌కతాలో పెట్రోల్ రూ.101.25, డీజిల్ రూ.92.81గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.107.20, డీజిల్ 27 పైసలు తగ్గి రూ.97.29 వద్ద ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.23, లీటర్ డీజిల్ రూ.94.24, కోల్‌కతాలో పెట్రోల్ రూ.101.35, డీజిల్ రూ.92.81గా ఉంది.

గమనిక: సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. జూన్ 15, 2017 నుండి అమలులోకి వచ్చాయి.సవరించబడింది పెట్రోల్ ధరలు ప్రతి రోజు ఉదయం 7 వరకు ఉన్న వివరాలు మాత్రమే. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి.

Tags

Read MoreRead Less
Next Story