కారు కొనాలనుకుంటున్నారా.. ప్రపంచంలో టాప్ 10 కాస్ట్లీ కార్లు ఇవే..

కారు కొనాలనుకుంటున్నారా.. ప్రపంచంలో టాప్ 10 కాస్ట్లీ కార్లు ఇవే..
అతి తక్కువ ధరలతో, ఆధునిక నాణ్యతా ప్రమాణాలను కలిగి ఉండటం ద్వారా తన గుడ్ విల్‌ని పెంచుకుంది

1 Hyundai motor co

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ బ్రాండ్‌లలో హ్యుందాయ్ ఒకటి. ఇది దక్షిణ కొరియాకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం.. 1967 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ కంపెనీ యొక్క కార్లు అతి తక్కువ ధరలతో, ఆధునిక నాణ్యతా ప్రమాణాలను కలిగి ఉండటం ద్వారా తన గుడ్ విల్‌ని పెంచుకుంది హ్యుందాయ్. గత సంవత్సరాలలో హ్యుందాయ్ 87 డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. అయితే ప్రస్తుతం హ్యుండాయి కంపెనీ విలువ 25 బిలియన్ డాలర్లుగా ఉంది.. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 2500 కోట్లు.

2 Ferrari N.V

నిస్సాన్, ఫియట్‌ వంటి దిగ్గజ ఆటోమొబైల్ సంస్థల పోటీని తట్టుకొని మరీ అత్యంత ధనిక కార్ల కంపెనీల లిస్ట్‌లో చోటు దక్కించుకుంది ఫెరారీ సంస్థ. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లను ఉత్పత్తి చేస్తున్న సంస్థలలో ఫెరారీ ఒకటి. అయితే ధర ఎక్కువగా ఉండటంతో ఈ సంస్థ యొక్క కార్ల ఉత్పత్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ వాల్యూమ్ తో, అధిక ధర వ్యాపార నమూనాపై ఆధారపడిన ఏకైక కంపెనీ ఇది. ఫెరారీ సంస్థ యొక్క ప్రస్తుత ఆదాయం రూ. 2900 కోట్లు.

3 Ford motor

ఫోర్డ్ మోటార్ సంస్థ 2008 సంవత్సరంలో సాధించిన మొత్తం ఆదాయం $148 బిలియన్లు. అదే సంవత్సరంలో ఫోర్డ్ స్థూల అమ్మకాలు ఫెరారీ కంటే 37 రెట్లు ఎక్కువ జరిగాయని ఒక అధ్యయనం ద్వారా తెలిసింది. ఫెరారీ వంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్‌లకు గట్టి పోటీని ఇచ్చిన ఈ అమెరికన్ కంపెనీ లాభాల మార్జిన్ 1.4% గా ఉంది. అయితే ప్రస్తుతం ఈ కంపెనీ మొత్తం విలువ 3600 కోట్లు.

4 Telsla

టెస్లా.. ఇది ఎలక్ట్రిక్ కార్లను తయారుచేసే దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. అయితే.. ప్రపంచ మార్కెట్లో ఫ్యూయల్ వాహనాలకి ఉన్న డిమాండ్ వల్ల కొన్ని నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ టెస్లా.. ధనిక కార్ల కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రపంచ మార్కెట్‌లో గట్టిపోటి ఉన్నప్పటికీ.. టెస్లా తన కార్ల ఉత్పత్తిని మరింత వేగవంతం చేసింది. ప్రస్తుతం టెస్లా సంస్థ ఉహించిన దానికన్నా 56 రెట్లు ఎక్కువ ఆదాయంతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ $39 బిలియన్ డాలర్లు.

5 BMW

BMW సంస్థ 1916 లో జర్మనీ లోని, మ్యూనిచ్ నగరంలో స్థాపించబడింది. ప్రపంచంలోని అత్యంత ధనిక కార్ల కంపెనీలలో BMW ఒకటి. గత కొన్ని సంవత్సరాలలో 107 డాలర్ల వార్షిక విలువను BMW సాధించింది. వార్షిక అమ్మకాల నిష్పత్తి కేవలం 0.4% గా ఉన్న BMW కంపెనీ విలువ.. ప్రస్తుతం 42 బిలియన్ డాలర్లు.

6 Honda motoranese

ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కంపెనీలలో హోండా కూడా ఒకటి. ఇది జపాన్ బేస్డ్ ఆటోమొబైల్ కంపెనీ. కొన్ని నెలల క్రితం వరకు హోండా మార్కెట్ క్యాప్ 61 బిలియన్ డాలర్లుగా ఉంది. కానీ.. ఇప్పుడున్న మార్కెట్ విలువ ప్రకారం ఈ కంపెనీ నెలకు 1 బిలియన్ డాలర్లను తగ్గించాల్సి వచ్చింది. అయినప్పటికీ.. ఈ కంపెనీ ఇప్పటికీ ప్రపంచంలోని టాప్ 10 కారు కంపెనీల జాబితాలో తన స్థానాన్ని నిలుపుకుంది. ఈ కంపెనీ విలువ దాదాపు $42 బిలియన్ డాలర్లు.

7 Daimler Ag

"డింలెర్ ఎగ్".. దీనినే మెర్సిడెస్ బెంజ్ అని కూడా పిలుస్తారు. ఇది జర్మన్ బేస్డ్ ఆటోమోటివ్ కంపెనీ. బెంజ్ కార్లకి ప్రపంచ మార్కెట్ లో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు. అందుకే ఇది టాప్ 10 కారు కంపెనీల జాబితాలో నిలిచింది. ఈ కంపెనీ ప్రస్తుత ఉత్పత్తి $3.34 మిలియన్లు. గత సంవత్సరం వరకు ఈ కంపెనీ సాధించిన వార్షిక ఆదాయం సుమారు 17,274.5 కోట్లు యూరోలు. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ $49 బిలియన్లు.

8 General motors co

ఇది ఒక అమెరికన్ మల్టీనేషనల్ ఆటోమోటివ్ కంపెనీ. ప్రస్తుతం ఈ కంపెనీ స్టాక్ ధర $31.79 us డాలర్లుగా ఉంది. 2019 సంవత్సరం వరకు ఈ కంపెనీ యొక్క కార్ల ఉత్పత్తి 77,18,000. ఈ కంపెనీ ప్రస్తుత విలువ $52 బిలియన్ డాలర్లు.

9 Volkswagen Ag

ఇది జర్మన్ బేస్డ్ ఆటోమోటివ్ కంపెనీ. ఇది జర్మన్ లేబర్ ఫ్రంట్ ద్వారా స్థాపించబడింది. ప్రపంచ గుర్తింపు పొందిన ఈ కార్ల కంపెనీ వార్షిక ఉత్పత్తి 1,08,23,000. ఈ కంపెనీ యొక్క ప్రస్తుత విలువ $13.346 బిలియన్ యూరోలు.

10 Toyota motor corporation

ఇది జపనీస్ ఆటోమొబైల్స్ కంపెనీ. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఇది ఒకటి. ఈ కంపెనీ ఆదాయం పరంగా ప్రపంచంలో 10 వ అతిపెద్ద కంపెనీగా పరిగణించబడింది. ప్రస్తుతం ఈ కంపెనీ యొక్క మొత్తం విలువ 211 బిలియన్ డాలర్లు గా ఉంది.


Tags

Read MoreRead Less
Next Story