Top 5 Upcoming Royal Enfield bikes: రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు.. హిమాలయన్ 450, క్లాసిక్ 650తో పాటు మరికొన్ని..

Top 5 Upcoming Royal Enfield bikes: రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు.. హిమాలయన్ 450, క్లాసిక్ 650తో పాటు మరికొన్ని..
Top 5 Upcoming Royal Enfield bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మోడల్ లైనప్‌ని అనేక కొత్త మోడల్స్ లాంచ్‌తో అప్‌డేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ మోడళ్లలో చాలా వరకు కొంతకాలంగా చర్చల్లో ఉన్నాయి. త్వరలో ఇవి మార్కెట్లోకి వస్తాయి.

Top 5 Upcoming Royal Enfield bikes: బ్రిటిష్ వాహన తయారీ సంస్థ ఇప్పటికే భారతదేశంలోని తన వినియోగదారుల కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411ని విడుదల చేసింది. ఇప్పుడు, చెన్నైకి చెందిన తయారీదారు హిమాలయన్ 450, మీటోర్ 650, క్లాసిక్ 650, హంటర్, షాట్‌గన్ వంటి కొత్త మోడల్‌ల శ్రేణితో వాహనదారుల ముందుకు వస్తోంది. కొత్త మోడళ్లలో, హిమాలయన్ 450 చాలా ఎక్కువ అంచనాలతో వస్తోంది. ఇందులో శక్తివంతమైన ఇంజన్‌తో రూపుదిద్దుకుంది. రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు..

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450

హిమాలయన్ యొక్క కొత్త వెర్షన్ లాంచ్‌కు షెడ్యూల్ చేయబడింది. 450cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ ఉంటుంది. ప్రస్తుతం ఇంజిన్ పవర్ ఫిగర్స్ కు సంబంధించిన వివరాలు పేర్కొనలేదు. అయితే ఇది 40hp మరియు 45Nm టార్క్ ఉత్పత్తి చేస్తుందని అంచనా.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650

స్పై షాట్‌ల ఆధారంగా, బైక్‌లో వృత్తాకార హెడ్‌ల్యాంప్, టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ తో పాటు మరిన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇది వృత్తాకార ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, స్ప్లిట్ డిటాచబుల్ పిలియన్ యూనిట్‌లను కలిగి ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఈ బైక్ 649 సిసి ట్విన్ సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటోర్ 650

రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ ఇప్పటికే భారతదేశంలో అమ్మకానికి ఉంది. అయితే ఈ కొత్త మోడల్ కు సూపర్ మెటోర్ అనే పేరుతో మార్కెట్లో ఉంది. ఇది మరింత పటిష్టమైన అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఉండబోతోంది. కొత్త మోటార్‌సైకిల్ ఇంటర్‌సెప్టర్ 650 వలె అదే ఇంజన్‌ను వారసత్వంగా పొందుతుందని భావిస్తున్నారు. అయితే, ఇంజన్ ట్యూనింగ్‌లు ఎలా ఉంటుందనే దానిపై సమాచారం లేదు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్

ఇటీవల, నటుడు సంగ్ కాంగ్ ఈ బైక్ యొక్క కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి డిజైన్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బైక్ ట్రిప్పర్ నావిగేషన్‌తో కూడిన సెమ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌ ఉంటుందని భావిస్తున్నారు. కాంటినెంటల్ GT 650, ఇంటర్‌సెప్టర్ 650 వంటి ఇంజన్‌లను ఈ బైక్‌కి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 రోడ్‌స్టర్ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. వినియోగదారుల ఆసక్తి దృష్ట్యా బ్రాండ్ నుండి ఎక్కువగా ఎదురుచూస్తున్న బైక్‌లలో ఈ బైక్ కూడా ఒకటి. ఈ బైక్ క్లాసిక్ 350, మెటోర్ 350లో ఉన్న OHC లేఅవుట్‌తో అదే 349cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో అందించబడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story