Toyota C+Pod: బుజ్జికారు భలేఉంది.. ధర చూస్తే..

Toyota C+Pod: బుజ్జికారు భలేఉంది.. ధర చూస్తే..
Toyota C+Pod: నగరాల్లోని ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని టయోటా గత ఏడాది డిసెంబర్‌లోనే జపాన్‌ ఈ కారును ఆవిష్కరించింది.

Toyota C+Pod: ఆటోమొబైల్ రంగంలో పేరెన్నికగన్న సంస్థ జపాన్‌కు చెందిన టయోటా. ఈ సంస్థ నానో కారు కంటే చిన్నగా ఉండే ఓ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. పార్కింగ్ స్థలం, రేంజ్ వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని టయోటా సీప్లస్ పాడ్ (C+pod) కారును లాంచ్ చేసింది.

సీ+పాడ్ ప్రత్యేకతలు..

నగరాల్లోని ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని టయోటా గత ఏడాది డిసెంబర్‌లోనే జపాన్‌ ఈ కారును ఆవిష్కరించింది. తాజాగా అన్ని దేశాల్లో సీ+పాడ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కారులో రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి. పూర్తిగా బ్యాటరీతో పనిచేస్తుంది.

త్రీటోన్ కలర్ ఆప్షన్స్‌తో వస్తున్న సీ+పాడ్‌కు 9.06 kwh లిథియం అయాన్ బ్యాటరీను అమర్చారు. ఈ కారు దాదాపు 150 కిమీ రేంజ్‌ను ఇవ్వనుంది. గరిష్ట వేగం గంటకు 60 కి.మీ.. స్టైలింగ్ పరంగా టయోటా సీ+పాడ్ ఎల్‌ఈడీ హెడ్ లైట్స్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లతో రానుంది. ఈ కారు బరువును తగ్గించేందుకు ప్యానెల్‌ను పూర్తిగా ప్లాస్టిక్‌తో తయారు చేశారు.

ఇక ధర విషయానికి వస్తే.. టయోటా సీ+పాడ్ ఎక్స్, జీ అనే రెండు వేరియంట్లలో రానుంది. ఎక్స్‌ట్రిమ్ ధర 1.65 మిలియన్ యెన్ (సుమారు రూ. 11.75 లక్షలు)గా ఉండగా, జీ ట్రిమ్ ధర 1.71 మిలియన్ యెన్ (సుమారు రూ.12.15 లక్షలు)గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story