CES 2024 : ట్రాన్స్పరెంట్ టీవీ.. ఎగిరే కారు.. టెక్నాలజీ భవిష్యత్ అదిరింది

CES 2024 : ట్రాన్స్పరెంట్ టీవీ.. ఎగిరే కారు.. టెక్నాలజీ భవిష్యత్ అదిరింది
CES 2024 లో వచ్చిన చాలా వాటిలో రెండు ప్రోడక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సంవత్సరంలో అతిపెద్ద టెక్ ఈవెంట్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2024 అమెరికాలోని లాస్ వెగాస్‌లో ప్రారంభమైంది. ఇందులో దక్షిణ కొరియా కంపెనీ ఎల్‌జీ ప్రపంచంలోనే తొలిసారిగా పారదర్శక(ట్రాన్స్ పరెంట్) టీవీని ప్రవేశపెట్టింది. ఇది కాకుండా, ఫ్లయింగ్ కార్ వంటి ప్రోడక్ట్స్ కూడా ప్రవేశపెట్టారు. 1.30 లక్షల మందికి పైగా ఈ CES హాజరవుతారని అంచనా. జనవరి 12 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 4000కు పైగా కంపెనీలు ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రదర్శిస్తున్నాయి. ఇందులో పాల్గొంటున్న కంపెనీల్లో 35% అమెరికన్లే.

CES-2024లో వచ్చిన చాలా వాటిలో రెండు ప్రోడక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ప్రపంచంలో మొట్టమొదటి పారదర్శక OLED డిస్ప్లే TV

దక్షిణ కొరియా కంపెనీ ఎల్‌జీ ప్రపంచంలోనే తొలిసారిగా పారదర్శక స్మార్ట్ టీవీని ప్రవేశపెట్టింది. ఇందులో 77 అంగుళాల గ్లాస్ డిస్‌ప్లే ఉంది. దీని కారణంగా, టీవీలో వచ్చే చిత్రాలు గాలిలో తేలియాడుతున్నట్లు కనిపిస్తాయి. LG సిగ్నేచర్ OLED TV ఈ సంవత్సరం చివరిలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. టీవీని ఆఫ్ చేస్తే అది కనిపించకుండా పోతుందని ఎల్‌జీ చెబుతోంది. టీవీ జీరో కనెక్ట్ బాక్స్‌తో వస్తుంది. ఇది వైర్‌లెస్ టెక్నాలజీ సహాయంతో టీవీలోని డిస్ప్లే ప్యానెల్‌కు వీడియో - ఆడియోను ప్రసారం చేస్తుంది. అలాగే సాంసంగ్ కంపెనీ కూడా ఇక్కడ మైక్రో LED- పవర్డ్ పారదర్శక టీవీని కూడా పరిచయం చేసింది.

2. XPeng ఎగిరే కారు..

XPeng Aero HT తన ఫ్లయింగ్ కారును CESలో పరిచయం చేసింది. ఈ కారు డెవలప్మెంట్ కి సంబంధించిన అప్‌డేట్‌లను పంచుకుంటూ, ఇక్కడ అందించిన కారు 2025లో భారీగా ఉత్పత్తి చేస్తామని కంపెనీ తెలిపింది. అయితే, దీనికి ముందు, కంపెనీ ఈ సంవత్సరం నాల్గవ త్రైమాసికం నుంచి మాడ్యులర్ EV/ eVTOL కాంబో కోసం ప్రీ-ఆర్డర్‌లను ప్రారంభిస్తుంది. పూర్తి-ఎలక్ట్రిక్ పైలట్ విమానం నిలువుగా టేకాఫ్ / ల్యాండింగ్ - తక్కువ ఎత్తులో ఎగురుతుంది. ఇది మాన్యువల్ - అటానమస్ ఫ్లైట్ మోడ్‌లను సపోర్ట్ చేస్తుంది. 270° పనోరమిక్ టూ పర్సన్ కాక్‌పిట్ విస్తృత వీక్షణను అందిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story