TRUMP: నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ మధ్యలో ట్రంప్

నెట్‌ఫ్లిక్స్ - వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ మధ్య కుదిరిన ఒప్పందానికి అడ్డంకులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విలీన వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ప్రభుత్వంతో సన్నిహితంగా సంబంధాలు ఉన్న పారామౌంట్ స్కైడ్యాన్స్ సంస్థ.. వార్నర్ బ్రదర్స్‌ను దక్కించుకునేందుకు భారీగా 108.4 బిలియన్ డాలర్ల హాస్టైల్ బిడ్ ను పెట్టింది. ఈ బిడ్డింగ్‌కు అధ్యక్షుడి అల్లుడు జేర్డ్ కుష్నర్ మద్దతు ఉన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదిక వెల్లడించింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన టీవీ ఛానళ్లు, సినిమా స్టూడియోలు, స్ట్రీమింగ్ విభాగాలను కొనుగోలు చేయడానికి నెట్‌ఫ్లిక్స్, కామ్‌కాస్ట్ కార్పొరేషన్, పారామౌంట్ సంస్థల మధ్య కొన్ని వారాలుగా పోటీ కొనసాగుతోంది.
అదే సమయంలో ఈ విక్రయ ప్రక్రియను పారామౌంట్ ప్రశ్నిస్తోంది. వార్నర్ బ్రదర్స్‌ను సొంతం చేసుకునేందుకు సెప్టెంబర్ నుంచి ఆ సంస్థ చేసిన ప్రతిపాదనలు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో 108.4 బిలియన్ డాలర్ల బిడ్ వేసింది. అంటే ఒక్కో షేరుకు 30 డాలర్లను చెల్లించేందుకు సిద్ధమైంది. మేనేజ్మెంట్ ఈ డీల్‌కు అనుకూలంగా లేనప్పుడు నేరుగా వాటాదారులు లక్ష్యంగా ఈ హాస్టైల్ బిడ్ వేస్తుంటారు. అలాగే తాను ప్రతిపాదించిన మొత్తాన్ని నగదు రూపంలో అందిస్తానని వెల్లడించింది. ఈ ప్రతిపాదిత ఒప్పందం కింది వార్నర్ బద్రర్స్‌కు చెందిన మిగిలిన వ్యాపారాలు కూడా రానున్నాయి. ఈ బిడ్ వెనక కుష్నర్ నేతృత్వంలోని అఫినిటీ పార్టనర్స్ ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో భాగంగా పారామౌంట్ వెల్లడించిందని వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. ఈ పరిణామాలు మీడియా దిగ్గజంగా ఎదగాలనుకున్న నెట్‌ఫ్లిక్స్ ఆశలకు గండి కొడుతున్నాయి. ఈ స్ట్రీమింగ్ సంస్థ చేసుకున్న తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఒక్కో షేరుకు 28 డాలర్లు అందించునుంది.
మిగిలిన వ్యాపారాలు కూడా..
సాధారణంగా మేనేజ్మెంట్ ఒప్పందాన్ని వ్యతిరేకించినప్పుడు,నేరుగా వాటాదారులనే లక్ష్యంగా చేసుకుని ఈ తరహా హాస్టైల్ బిడ్లు వేస్తారు. అలాగే ప్రతిపాదిత మొత్తాన్ని పూర్తిగా నగదు రూపంలోనే చెల్లిస్తామని పారామౌంట్ స్పష్టం చేసింది. ఈ డీల్ అమలైతే, వార్నర్ బ్రదర్స్‌కు చెందిన మిగిలిన వ్యాపార విభాగాలన్నీ కూడా ఈ ఒప్పందంలో భాగమవనున్నాయి. ఈ బిడ్ వెనుక జేర్డ్ కుష్నర్ నేతృత్వంలోని అఫినిటీ పార్టనర్స్ సంస్థ ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా పారామౌంట్ వెల్లడించినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఈ పరిణామాలన్నీ మీడియా దిగ్గజంగా ఎదగాలని భావిస్తున్న నెట్‌ఫ్లిక్స్ ఆశలకు గండికొడుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ కుదుర్చుకున్న తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఒక్కో షేరుకు 28 డాలర్లు చెల్లించేందుకు అంగీకరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

