TVS Scooty Pep Plus EMI Calculator: కొంచెం కష్టపడి నెలకు రూ.1,777లు కడితే కొత్త స్కూటర్ ఇంటికి..

TVS Scooty Pep Plus EMI Calculator: కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తే క్షణమైనా ఆలస్యం చేయకండి.. మొదట్లో కొంచెం కష్టమే.. అయినా పాత స్కూటర్‌తో ఇబ్బందులు పడేకంటే కొత్త స్కూటర్‌తో పనులు చక చకా పూర్తి చేసుకోవచ్చు. తరచుగా సర్వీసింగ్ చేయించుకుంటే మైలేజ్ బావుంటుంది. రిపేర్లు కూడా త్వరగా రావు.
ఇంతకీ చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ తాజాగా తమ సంస్థకు సంబంధించిన స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ మోడల్‌పై ఈ ఆఫర్ ఉంది. ఈ స్కూటర్‌ను తక్కువ ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ.1777 నుంచి ఈఎంఐ ప్రారంభమవుతుంది.
టీవీఎస్ మోటార్ వెబ్‌సైట్ ప్రకారం.. స్కూటీ పెప్ ప్లస్‌పై తక్కువ ఈఎంఐ రూ.1777గా ఉంది. రుణంపై వడ్డీ రేటు 6.99 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు కొనుక్కోండి తరువాత డబ్బులు కట్టండి అనే ఆప్షన్ కూడా అందులో ఉంది. ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే దగ్గరలోని టీవీఎస్ షోరూమ్‌కి వెళితే మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఇక ఈ స్కూటీ ధర విషయానికి వస్తే రూ.54 వేల నుంచి ప్రారంభమవుతోంది. ఏడు రంగుల్లో లభ్యమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com