టీవీఎస్ నుంచి మరో సరికొత్త బైక్.. మార్కెట్లోకి

టీవీఎస్ నుంచి మరో సరికొత్త బైక్.. మార్కెట్లోకి
అత్యుత్తమ మైలేజిని అందించే వాహనాలను ఉత్పత్తి చేయడంలో గుర్తింపు పొందిన సంస్థగా టీవీఎస్‌కు పేరుంది. బడ్జెట్ ధరలో వాహనాలను అందిస్తూ విక్రయాల్లో దూసుకెళ్తోంది.

ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ తన స్టార్ సిటీ ప్లస్ మోడల్లో సరికొత్త బైక్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర రూ.65,865గా సంస్థ నిర్థేశించింది. అత్యుత్తమ మైలేజిని అందించే వాహనాలను ఉత్పత్తి చేయడంలో గుర్తింపు పొందిన సంస్థగా టీవీఎస్‌కు పేరుంది. బడ్జెట్ ధరలో వాహనాలను అందిస్తూ విక్రయాల్లో దూసుకెళ్తోంది. వీటిల్లో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ సక్సెస్ అయింది. తాజాగా మార్కెట్లో సరికొత్త బ్లూ అండ్ సిల్వర్ డ్యూయల్ కలర్స్‌లో లభ్యమవుతోంది.

వేరియంట్ల వారీగా ధర..

రెండు వేరియంట్లలో లభ్యమవుతున్న టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్.. డ్రమ్ వేరియంట్ ధర రూ.65,865 ఉంటే, డిస్క్ వేరియంట్ ధర రూ.68,465గా పొందుపరిచింది. డిస్క్ వేరియంట్ బ్లాక్, రెడ్ కలర్లలో లభ్యమవుతుండగా, డ్రమ్ వేరియంట్ బ్లాక్-బ్లూ, గ్రే-బ్లాక్, వైట్-బ్లాక్ కలర్లలో లభ్యమవుతోంది.

ఇక ఈ ప్రత్యేకతలు తీసుకుంటే ఈ సరికొత్త టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ మోడల్లో డిస్క్ వేరియంట్‌ను ఇటీవలే లాంచ్ చేసింది సంస్థ. రోటో పెటల్ డిస్క్ బ్రేక్స్, ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజిన్, యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్స్ ఎల్ఈడీ హెడ్ ల్యాంపు లాంటి ప్రత్యేకతలను ఇందులో పొందుపరిచారు. వీటితో పాటు సింగిల్ పీస్ హ్యాండిల్ బార్, 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంకు, సింగిల్ పీస్ డ్యూయల్ ఫినిష్ సీటు, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. స్కిన్‌లో ఫ్యూయల్ లెవల్ ఇండికేటర్, ఓడో మీటర్‌తో పాటు ఇతర చేసిక్ రీడౌట్లు ఉన్నాయి.

116 కేజీల బరువుతో వస్తున్న ఈ బైక్ 109 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 7350 ఆర్పీఎం వద్ద 8.08 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 4500 ఆర్సీఎం వద్ద 8.7 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజీ విషయానికి వస్తే దీని ఇతర మోడల్స్‌తో పోలిస్ 15 శాతం అధికంగానే ఉంటుంది. ఎలాంటి వాతావరణంలోనైనా డ్రైవింగ్ చేసేందుకు అనకూలంగా ఈ బైక్‌ని డిజైన్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story