Twitter Logo: ట్విట్టర్ లోగో మార్పు..! కొత్త లోగో 'X'

Twitter Logo: ట్విట్టర్ లోగో మార్పు..! కొత్త లోగో X
ట్విట్టర్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది నీలి రంగులో ఎగురుతూ కనిపించే పక్షి బొమ్మే. ఈ పక్షి పేరు ల్యారీ(Larry). కానీ ఇప్పుడు ఈ లోగో స్థానంలో కొత్త లోగో కూడా రానుంది.

Twitter Logo: తన నిర్ణయాలతో ముదుపర్లను, వినియోగదారులను, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలన్‌ మస్క్ ఇప్పుడు మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ట్విట్టర్‌ బ్రాండ్‌ 'X' గా రూపాంతరం చెందుతుందని వెల్లడించాడు. ఈ అనూహ్య, భారీ మార్పులకు అంతా సిద్ధంగా ఉండాలని అన్నాడు.

ట్విట్టర్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది నీలి రంగులో ఎగురుతూ కనిపించే పక్షి బొమ్మే. ఈ పక్షి పేరు ల్యారీ(Larry). కానీ ఇప్పుడు ఈ లోగో స్థానంలో కొత్త లోగో కూడా రానుంది.


"త్వరలోనే ట్విట్టర్ బ్రాండ్‌కి ఫేర్‌వెల్ పలకనున్నాము. క్రమంగా పక్షులకి కూడా" అంటూ పరోక్షంగా లోగోని మార్చనున్నట్లు సంకేతమిచ్చాడు.

ఇప్పటికే ఈ నిర్ణయాలకి సంబంధించిన ఆచరణ మొదలైంది. X.com వెబ్‌సైట్ కూడా ట్విట్టర్‌కి వెబ్‌సైట్‌కి వెళుతోంది.

అంటే వినియోగదారులు X.com అని టైప్ చేస్తే ట్విట్టర్‌ వెబ్‌సైట్‌కి రీ డైరెక్ట్ అవుతుంది. త్వరలోనే Twitter.com డొమైన్, X.com గా మారే అవకాశం ఉంది.

దీనికి సంబంధించి మస్క్ తన ట్విట్టర్ ఖాతాలో X అనే లోగోని, X అక్షరాన్ని కూడా పోస్ట్ చేశాడు.



ట్విట్టర్ కంపెనీ సీఈవో లిండా యాకారినో ట్విట్టర్‌లో స్పందిస్తూ.. మన జీవితంలోనూ, వ్యాపారంలో మనల్ని మనం మరోసారి నిరూపించుకోవడానికి అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఇంతకు ముందు ట్విట్టర్ స్థాపించి సమాచార మార్పిడి విధానాన్ని సమూలంగా మార్చాం. ఇప్పుడు X తో ప్రపంచాన్ని మరింతగా మారుస్తాం అని వెల్లడించింది. 8 నెలలుగా పై పనిచేస్తూ దానికి ఒక రూపాన్నిచ్చాం. త్వరలో మీ ముందుకు తెస్తాం అని వెల్లడించింది.






Tags

Read MoreRead Less
Next Story