ULAA: దిగ్గజాలను దాటిన స్వదేశీ బ్రౌజర్..!

వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్స్‌కు ధీటుగా 'అరట్టై' యాప్‌ను విజయవంతంగా లాంచ్ చేసిన జోహో ఇప్పుడు సరికొత్త బ్రౌజర్‌ని తీసుకొచ్చింది. 'ఉలా బ్రౌజర్' పేరుతో జోహో తీసుకొచ్చిన ఈ యాప్ ప్రస్తుతం యాప్ స్టోర్ చార్టులో అగ్రస్థానంలో నిలిచింది. ఇది కూడా అరట్టై తరహాలోనే గూగుల్ క్రోమ్, ఆపిల్ సఫారీ వంటి అంతర్జాతీయ దిగ్గజ బ్రౌజర్లకు పోటీగా నిలుస్తోంది. పూర్తి స్వదేశీ ఇంజనీర్ల మేధతో ఇవి రూపొందటం అభినందనీయం.
ప్రత్యేకతలు ఇవే:
ఉలా బ్రౌజర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మ్యాక్, లినక్స్ వంటి అన్ని ప్లాట్ఫామ్లో ఉంది. దీని గోప్ప ఫీచర్ గోప్యత. ఉలా బ్రౌజర్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించదు, స్టోర్ చేయదు ఇంకా ఇతరులకు విక్రయించదు. గూగుల్ ప్రకటనల కోసం డేటాను సేకరిస్తుంది, కానీ ఉలా పూర్తిగా వినియోగదారుల గోప్యతకు ప్రాధాన్యత ఇస్తుంది.
స్మార్ట్ గ్రూపింగ్
ట్యాబ్స్ మేనేజర్ ద్వారా వినియోగదారులు పేజీలను పిన్ చేయడం, పాజ్ చేయడం, సేవ్ చేయడం చేయవచ్చు. స్మార్ట్ గ్రూపింగ్ ఫీచర్ ఆటోమేటిక్‌గా ట్యాబ్స్‌ను గ్రూపులుగా విభజిస్తుంది, అవసరమైన పేజీ త్వరగా కనుగొనడానికి సహాయపడుతుంది. ఉలా సింక్ పాస్వర్డ్స్, బుక్మార్కులు, సెర్చ్ హిస్టరీ, సెట్టింగ్స్‌ను పలు పరికరాల మధ్య షేర్ చేస్తుంది. ఉలాలో బిల్ట్-ఇన్ అడ్స్ బ్లాకర్ ఉంది, ఇది ట్రాకర్స్, మోసపూరిత ప్రకటనలు,పాప్-అప్స్, మాల్వేర్ని నిరోధిస్తుంది.
యాడ్ బ్లాకర్, ట్రాకర్ ప్రొటెక్షన్
బ్రౌజింగ్ అనుభవం సురక్షితంగా ఉండేందుకు ఇందులో యాడ్ బ్లాకర్లు ఇంకా ట్రాకర్ ప్రొటెక్షన్ ఇన్-బిల్ట్ గా ఉన్నాయి. ఈ బ్రౌజర్లో ఐదు రకాల మోడ్లు ఉన్నాయి. వర్క్, పర్సనల్, కిడ్స్, డెవలపర్ (సాఫ్ట్వేర్ డెవలపర్ల కోసం).
పాస్వర్డ్, బుక్‌మార్క్ మేనేజ్మెంట్
ఉలాలో పాస్వర్డ్ మేనేజర్, బుక్‌మార్క్స్ మేనేజర్ ఉన్నాయి, వీటివల్ల వినియోగదారులు వివరాలను సురక్షితంగా సేవ్, ఎడిట్, ఆర్గనైజ్ చేయవచ్చు. అలాగే స్క్రీన్ క్యాప్చర్ టూల్ కలిగి ఉంది, ఇది పూర్తి లేదా భాగస్వామిక స్క్రీన్‌షాట్ తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇది క్రోమ్ ఎక్స్టెన్షన్స్కు మద్దతు ఇస్తుంది. కాబట్టి వినియోగదారులు సొంత అనుభవం కోసం వాటిని ఉపయోగించవచ్చు.
ప్రభుత్వ గుర్తింపు
ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్వహించిన 'ఇండియన్ వెబ్ బ్రౌజర్ డెవలప్మెంట్ ఛాలెంజ్'ను కూడా ఉలా బ్రౌజర్ గెలుచుకుంది. యూజర్లు ప్రతిసారి లాగిన్ చేయకుండానే జోహో యాప్‌లో సులభంగా, సురక్షితంగా సైన్ ఇన్ చేయవచ్చు. అలాగే, వివిధ బ్రౌజర్ మోడ్లు జోహో యాప్స్ కోసం AI- ఆధారిత సెర్చ్ సిస్టమ్ 'జియా' తో కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ప్రస్తుతానికి, ఉలా బ్రౌజర్లో గూగుల్ క్రోమ్ వంటి బ్రౌజర్లలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు లేవు. బ్రౌజర్ రేసులో గూగుల్ క్రోమ్‌ను అధిగమించాలంటే, ఉలా బ్రౌజర్లో మరిన్ని అధునాతనమైన AI ఫీచర్లను తీసుకురావాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com