UPI: ఫారిన్‌లో కూడా యూపీఐతో చెల్లింపులు

UPI :ఫారిన్‌లో కూడా యూపీఐతో చెల్లింపులు జరపడానికి ఫోన్‌పే వీలు కల్పిస్తోంది. విదేశీ మర్చంట్లకు అక్కడి లోకల్ క్యూఆర్ కోడ్ ఉంటే, స్కాన్ చేయడంతో ఇండియన్స్ ఫోన్‌పేతో డబ్బు చెల్లించొచ్చు. ఇలా విదేశాలలో యూపీఐ చెల్లింపులు జరపడానికి అనుమతి పొందిన మొదటి ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్ పే నే. దేశంలో యూపీఐ ట్రాన్సాక్షన్లలో ఫోన్‌పే మార్కెట్ లీడర్‌గా ఉంది. ఇంటర్నేషనల్ డెబిట్‌కార్డులతో ఎలా ట్రాన్సాక్షన్లు జరుపుతామో, అదే తరహాలో ఫోన్ పే యూపీఐతోనూ ఇకమీదట జరపొచ్చు.
యూఏఈ, సింగపూర్, మారిషస్, నేపాల్, భూటాన్ దేశాలలోని మర్చంట్ అవుట్లెట్లలో ఈ సదుపాయం వాడుకోవచ్చని ఫోన్ పే ప్రకటించింది. ఫోన్ పే యూజర్లు తమ యాప్‌లో యూపీఐ ఇంటర్నేషనల్‌ను యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుందని వివరించింది. ఇలా యాక్టివేట్ చేసుకోవడానికి యూపీఐ పిన్ను ఎంటర్ చేస్తే చాలని ఫోన్ పే తెలిపింది. దీంతో విదేశాలలో చెల్లింపులకు క్రెడిట్‌కార్డు లేదా ఫారెక్స్కార్డు అవసరం ఉండదు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com