IPO: జులై 12న ఉత్కర్ష్ బ్యాంక్ షేర్ల ఇష్యూ ఆరంభం

దేశంలో స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంకింగ్‌లో అగ్రగామిగా ఉన్న ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంక్ జులై 12న IPO(Initial Public Offering)కు రంగం సిద్ధం చేసింది. రూ.500 కోట్లను సమీకరంచాలనే లక్ష్యంతో రానుంది. జులై 12న ఇష్యూ ప్రారంభమవనుండగా, జులై 14నముగియనుంది. షేర్లు అలాట్ అయిన ముదుపర్లకు జులై 19న కన్ఫర్మ్ చేసి, వారి ఖాతాల్లో జులై 19న జమ చేయనున్నారు. జులై 24 నుంచి NSE, BSE రెండు ఎక్స్ఛేంజ్‌లోనూ షేర్లు ట్రేడవనున్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసికి చెందిన ఈ బ్యాంక్ షేర్లను ఇష్యూ చేసి 500 కోట్లను సమీకరించనుంది. ముదుపర్లు జులై 12 నుంచి, 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు షేర్లకు బిడ్ వేయవచ్చు. ఒక్కో షేర్ ధరకు 23 నుంచి 25 రూపాయల వరకు ధర నిర్ణయించారు. అయితే ముదుపర్లు షేర్లను లాట్ పరిమాణాల్లోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 600 షేర్లను 1 లాట్‌గా నిర్ణయించారు. దీంతో 1లాట్ కనీస ధర 13,13,800 నుంచి 15000 వరకు వెచ్చించాల్సి ఉంటుంది.
మొత్తం షేర్లలో 75శాతాన్ని క్వాలిఫైడ్ సంస్థాగత కొనుగోలుదారులకు, 15 శాతం వాటా సంస్థాగత ముదుపర్లు కాని వారికి, మిగిలిన 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు.
2016 సంవత్సరంలో స్థాపించబడిన ఈ బ్యాంక్, 2017లో కార్యకలాపాలు ప్రారంభించింది. డిపాజిట్ల స్వీకరణ, సేవింగ్స్ ఖాతాలు, శాలరీ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, రుణాలు, రికరింగ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, లాకర్ వంటి పలు సౌకర్యాలను ఖాతాదారులకు అందిస్తోంది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ ప్రాంతాల నుంచే ఎక్కువ మంది ఖాతాదారులు ఉన్నారు. బ్యాంకుకు మొత్తంగా 3.59 మిలియన్ల ఖాతాదారులు ఉన్నారు. మార్చితో ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.2,804 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయడమే కాకుండా, అదే కాలానికి 404 కోట్ల లాభాల్ని ఆర్జించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com