IPhone : వాలెంటైన్స్ డే సేల్‌.. రూ.66వేలకే ఐఫోన్ 15

IPhone : వాలెంటైన్స్ డే సేల్‌.. రూ.66వేలకే ఐఫోన్ 15

సెప్టెంబర్ 2023లో భారతదేశంలో ప్రారంభమైన iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max వంటి వివిధ మోడళ్లలో వస్తుంది. ఇది 128GB, 256GB, 512GB స్టోరేజీ కెపాసిటీని అందిస్తుంది. iOS 17తో Apple A16 బయోనిక్ చిప్‌తో నడుస్తుంది. ప్రస్తుతం, వాలెంటైన్స్ డే మొబైల్ బొనాంజా నేపథ్యంలో ప్లిఫ్ కార్ట్(Flipkart)లో తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.

తగ్గింపు ధరలు, ఆఫర్లు

నలుపు, నీలం, ఆకుపచ్చ, గులాబీ, పసుపు రంగులలో లభించే ఈ 128GB వెర్షన్ బేస్ మోడల్, వాస్తవ ధర రూ. 79,900. కానీ ఇప్పుడు అది ఫ్లిప్‌కార్ట్‌లో HDFC క్రెడిట్ కార్డ్ వినియోగదారులు, ఎంపిక చేసిన బ్యాంకుల కస్టమర్లకు అదనపు తగ్గింపులతో కలిపి రూ. 66,999కే రానుంది.

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్‌లు, ముఖ్య లక్షణాలు

ఐఫోన్ 15 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను 2,000 నిట్‌ల వరకు బ్రైట్ అండ్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ తో రానుంది. ఇది డైనమిక్ ఐలాండ్ ఫీచర్, IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ని కూడా కలిగి ఉంది. దీని డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌లో 48-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి.

Tags

Next Story