ఔను..మేం తప్పు చేశాం! : వోడాపోన్ ఐడియా

ఔను..మేం తప్పు చేశాం! : వోడాపోన్ ఐడియా
మేం తప్పు చేశాం! కానీ చిన్నదేనంటోన్న వోడాపోన్ ఐడియా

సబ్‌స్క్రైబర్ల బేస్ పెరిగిందంటూ ఆనందపడుతోన్న వోడాఫోన్ ఐడియా ఇన్వెస్టర్లకు యాజమాన్యం ఓ చిన్న ఝలక్ ఇచ్చింది. ట్రాయ్‌కి సబ్‌మిట్ చేసిన తమ సబ్‌స్క్రైబర్ల డేటాలో తప్పులున్నాయంటూ అంగీకరించింది ఐతే ఆ తప్పిదం చాలా చిన్నదేనని..దాన్ని కూడా సవరించి తిరిగి ట్రాయ్‌కి లెక్కా పత్రం అప్పగించినట్లు కూడా ముక్తాయింపునిచ్చింది.

ఇంతకీ విషయం ఏమిటంటే, వోడాఫోన్ ఐడియా గత జనవరి నెలలో చందాదారుల సంఖ్య భారీగా పెరిగిందంటూ ట్రాయ్‌కి వివరాలు సమర్పించింది. అసలు ఈ మధ్యకాలంలో కొత్తగా వోడాఫోన్‌వైపు యూజర్లు చూడటమే మానేశారు. అలాంటిది 17లక్షలమంది కొత్త కస్టమర్లు వచ్చారనగానే కంపెనీలో ఓ జోష్ నెలకొంది. ఐతే ఇంత భారీ పెరుగుదల అంతా కూడా ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమప్రాంతం నుంచే నమోదు కావడంపై అనలిస్టులు సహా చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఇక్కడ ఒక్క చోట నుంచే ఎక్కువమంది యూజర్లు వచ్చారనడంపై కంపెనీ కూడా డాక్యుమెంట్లు సరిచూసుకుని అది కంపెనీ ఎగ్జిక్యూటివ్ చేసిన పొరపాటుగా గుర్తించింది.

ట్రాయ్ డేటా ప్రకారం వోడాఫోన్ఐడియాకి 286 మిలియన్ల మొబైల్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వారిలో 256.3 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లుగా తెలుస్తోంది. అంటే వోడాఫోన్ ఐడియా వాడేవాళ్ల సంఖ్య దాదాపు పాతికకోట్లకిపై మాటే అన్నమాట. గత 15 నెలల్లో వోడాఫోన్ ఐడియా నుంచి జంప్ అయ్యే వాళ్లే కానీ, జత కలిసింది లేదు. ఇప్పుడా కొత్త యూజర్ల బేస్ కలవడంతో తొందర్లో కంపెనీకి మంచి రోజులు రావచ్చనే అంచనాలు నెలకొన్నాయ్. గత సెషన్‌లో వోడాఫోన్ఐడియా షేర్లు 2.20శాతం నష్టపోయి రూ.9.70వద్ద ముగిశాయ్.

Also Read : Profit Your Trade

Tags

Read MoreRead Less
Next Story