OIL PRICES: వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న చమురు ధరలు

OIL PRICES: వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న చమురు ధరలు
X
ఇజ్రాయెల్ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై దాడులు.. చమురు ధరలపై ప్రభావం

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. ఇజ్రాయెల్ ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై దాడులు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

చమురు ధరలపై ప్రభావం

ఈ దాడుల ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు 12 శాతానికి పైగా పెరిగాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) బ్యారెల్ ధర 12.6 శాతం పెరిగి $76.61 డాలర్లకు చేరుకోగా, బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ ధర 12.2 శాతం పెరిగి $77.77 డాలర్లకు చేరింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం, ముఖ్యంగా హర్మోజ్ జలసంధి ద్వారా జరిగే గ్లోబల్ ఆయిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చనే ఆందోళనలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.

భారత చమురు రంగ షేర్లపై ప్రభావం

ఈ పరిణామాలు భారత చమురు రంగ షేర్లను ప్రభావితం చేశాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) షేర్లు 6.1 శాతం తగ్గి ₹299.20 వద్ద ట్రేడవుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) షేర్లు 3.9 శాతం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ షేర్లు 5.3 శాతం నష్టపోయాయి.

హర్మోజ్ జలసంధి ప్రాముఖ్యత

హర్మోజ్ జలసంధి ఒమన్ మరియు ఇరాన్ మధ్య సముద్ర మార్గంలో ఉంది. దాదాపు 40 కిలోమీటర్ల మేర ఇరుకైన ఈ ప్రదేశంలో, నౌకల రాకపోకల కోసం 2.1 కిలోమీటర్ల నావిగేషన్ ఛానల్ ఉంది. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, ఇరాక్, మరియు ఇరాన్ వంటి దేశాల నుండి రోజుకు సుమారు 21 మిలియన్ బ్యారెళ్ల చమురు ఈ జలసంధి ద్వారా వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంది. ఇది ప్రపంచవ్యాప్త రోజువారీ చమురు వినియోగంలో 21 శాతానికి సమానం. అంతేకాకుండా, అంతర్జాతీయంగా ఎల్‌ఎన్‌జీ (LNG) వినియోగంలో 20 శాతం కూడా ఇక్కడి నుండే సరఫరా జరుగుతుంది. ఈ జలసంధి గుండా సరఫరాకు అంతరాయం ఏర్పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హార్ముజ్ జలసంధి గుండా డజన్ల ట్యాంకర్లు వెళ్తూ వస్తుంటాయి. మిడిల్ ఈస్ట్‌లో ప్రధాన చమురు, సహజ వాయువు ఉత్పత్తిదారులు, వారి వినియోగదారులు ఈ ప్రాంతం నుంచే ఇంధనాన్ని రవాణా చేస్తుంటాయి. మిడిల్ ఈస్ట్ చమురు ఉత్పత్తులను ప్రపంచానికి.. ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా, ఎగువ ప్రాంతాలకు అనుసంధానించేది ఈ జలసంధే. ఉత్తరాన ఇరాన్‌, దక్షిణాన ఒమన్‌, (యూఏఈ) హద్దులుగా ఉన్న ఈ హార్ముజ్ జలసంధి, గల్ఫ్ ను అరేబియా సముద్రంతో కలుపుతుంది.

Tags

Next Story