2 March 2021 4:47 AM GMT

Home
 / 
బిజినెస్ / Warren-Buffet :...

Warren-Buffet : బాండ్లను నమ్మొద్దు.. ముంచేస్తాయి: వారెన్ బఫెట్ సెన్సేషనల్ కామెంట్స్

Warren-Buffet : "ఈ కాలంలో బాండ్లు సరైనవి కాదు, పెన్షన్ ఫండ్ కాదు, ఇన్సూరెన్స్ , రిటైర్ మెంట్ ఫండ్స్ కాదు, ఏదైనా సరే రాబోయే రోజుల్లో అనూహ్యమైన ఫలితాలు ఎదుర్కోవాల్సి రావచ్చు" .

Warren-Buffet : బాండ్లను నమ్మొద్దు.. ముంచేస్తాయి: వారెన్ బఫెట్  సెన్సేషనల్ కామెంట్స్
X

Waren Buffet

Waren Buffet: అమెరికా మార్కెట్ల పతనానికి, మన మార్కెట్లలో బ్లడ్‌బాత్‌కి కారణమైన బాండ్లపై సెన్సేషనల్ కామెంట్ చేశారు వారెన్ బఫెట్. అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ ఇన్వెస్టర్ అయినా, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ( ఖచ్చితమైన ఆదాయం) కోసం చూసే ఎలాంటి మదుపరులకైనా ఆయన తాజా వ్యాఖ్యలు కాసింత చేదుగుళికలే..ఇంతకీ ఆయన ఏం అన్నారంటే..,

"ఈ కాలంలో బాండ్లు సరైనవి కాదు, పెన్షన్ ఫండ్ కాదు, ఇన్సూరెన్స్ , రిటైర్ మెంట్ ఫండ్స్ కాదు, ఏదైనా సరే రాబోయే రోజుల్లో అనూహ్యమైన ఫలితాలు ఎదుర్కోవాల్సి రావచ్చు" అంటూ తన అభిప్రాయాన్ని బెర్క్‌షైర్ హాథవే షేర్ హోల్డర్లకు రాసిన ఓ లేఖలో పంచుకున్నారు.

గత ఏడాది కాలంలో అమెరికా ఎదుర్కొన్న అనుభవాలు, కరోనా, లాక్‌డౌన్, ఆర్థిక సంక్షోభం, సామాజిక అస్థిరత, అల్లర్లు, కొత్త అధ్యక్షుడి ఎన్నిక వంటి అనేక అంశాలపై తన ఒపీనియన్ పంచుకున్న వారెన్ బఫెట్, అమెరికా అజేయశక్తిగా ఆర్థికరంగంలో ఇంకా కొనసాగుతుందని..ఎకానమీ విషయంలో ఢోకా లేదని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఇప్పుడు అంతా ప్రశాంతంగా కామ్‌గా ఉఁడాల్సిన సమయం అని తొందర్లోనే అంతా సర్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

గత 50ఏళ్ల క్రితం బెర్క్‌షైర్ హాథవే ఎలా తన వేల్యూ బ్రాండ్ నిలబెట్టుకుందో..ఇప్పటికీ అదే రకమైన విలువ కలిగి ఉందని చెప్పారు. 15 పేజీల సుదీర్ఘమైన తన లేఖలో ఎక్కడా బిట్‌కాయిన్ గురించిన ప్రస్తావన చేయలేదు. అంతేకాదు రెడిట్ కొనుగోలు చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.

తప్పు చేశా..!

బెర్క్‌షైర్ హాథవే 2016లో ప్రిసిషన్ కేస్ట్‌పార్ట్స్ అనే కంపెనీని ఓ ఎయిర్ క్రాఫ్ట్‌ని 32.1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అంత రేటు పెట్టి ఉండకూడదని తాజా వారెన్ బఫెట్ అంగీకరించారు. తాను తప్పు చేసానంటూ తన లేఖలో ప్రస్తావించారు. ప్రిసిషన్ కేస్ట్‌పార్ట్స్ కంపెనీని గత ఏడాది ఆయన 9.8 బిలియన్ డాలర్లకే అమ్మేశారు. ఇదే కాదు గతంలో క్రాఫ్ట్ పుడ్స్ అనే కంపెనీని కూడా ఎక్కువ రేటు పెట్టి కొన్నట్లు రెండేళ్ల క్రితం ఒప్పుకున్నారాయన ఈ సందర్భంగా కొంతమంది అసలు వారెన్ బఫెట్ ఔట్ డేటెడ్ అయిపోయారని..

ఆయన మాటలకు గతంలో ఉన్న వేల్యూ లేదంటూ కూడా విమర్శలు చేస్తున్నారు..కొత్త జనరేషన్ ఆశలు, ఆశయాలు ఆయనకి తెలీవని..వాళ్లు చెప్పే మాటలూ వినే టైమ్ వచ్చిందని (బిట్ కాయిన్ విషయంలో ప్రత్యేకించి) అంటున్నారు. ఐతే ఈ మాటలు ఎవరో కాదు ఆయన భాగస్వామి ఛార్లీ ముంగర్ చెప్పడం గమనార్హం.. ఐతే ఈ భిన్నాభిప్రాయాలు తమ సంస్థపై కానీ, భాగస్వామ్యంపై ఎలాంటి ప్రభావం చూపదని కూడా గుర్తు చేస్తారాయన.

Next Story