31 Aug 2020 9:16 AM GMT

Home
 / 
బిజినెస్ / 90 ఏళ్ల వయసులో...

90 ఏళ్ల వయసులో రూ.42వేల కోట్ల పెట్టుబడులు

90 వ ఏట అడుగుపెట్టిన వారెన్ బఫెట్ నిర్ణయం ప్రపంచ మార్కెట్ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

90 ఏళ్ల వయసులో రూ.42వేల కోట్ల పెట్టుబడులు
X

ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త, ఇన్వెస్టర్ వారెన్ బఫెట్.. జపాన్ కు చెందిన 5 కంపెనీల్లో మొత్తం 42వేల కోట్లకు పైగా పెట్టబడులు పెట్టారు. అది కూడా ఆయన పుట్టినరోజు ఆగస్టు30న. 90 వ ఏట అడుగుపెట్టిన వారెన్ బఫెట్ నిర్ణయం ప్రపంచ మార్కెట్ వర్గాల్లో ఆసక్తిగా మారింది. జపాన్ లో ఆ కంపెనీల షేర్లు పరుగులు తీశాయి. వారెన్ బఫెట్ కు చెందిన బెర్క్ షైర్ కంపెనీ జపాన్ కు చెందిన ఇటొచు కార్పొరేషన్, మారుబెని, మిత్సిబుషి, మిట్ స్యు అండ్ కో, సుమిటోమో కార్పొరేషన్లలో ఇన్వెస్ట్ చేసింది. అన్ని కంపెనీల్లో దాదాపు 5శాతం వాటాలను సొంతం చేసుకుంది. ఈ ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయా కంపెనీల షేర్లే ఏకంగా 5శాతం పెరిగాయి.

Next Story