మన బడ్జెట్‌లోనే భాగ్యనగరంలో మనకో ఇల్లు.. తక్కువ ధరలో ఎక్కడ..

మన బడ్జెట్‌లోనే భాగ్యనగరంలో మనకో ఇల్లు.. తక్కువ ధరలో ఎక్కడ..
ఆ ఏరియాలో ఓ ఇల్లు చూశాన్రా.. ఇల్లు చాలా బావుంది. కానీ రేటే భయపెడుతుంది. అందుకే ఆలోచిస్తున్నాను. అని అనే అంతలోనే ఏడాది గడిచిపోతుంది.

ఆ ఏరియాలో ఓ ఇల్లు చూశాన్రా.. ఇల్లు చాలా బావుంది. కానీ రేటే భయపెడుతుంది. అందుకే ఆలోచిస్తున్నాను. అని అనే అంతలోనే ఏడాది గడిచిపోతుంది. రేటు మరికాస్త పెరిగి మరింత భయపెడుతుంది. ఏవండీ మనకి ఇల్లు ఎప్పుడు కొంటారు అన్న ఆలికి ఎలా సమాధానం చెప్పేది. అప్పుడు నా మాట వినలేదు.. ఇప్పుడు చూడండి మరింత పెరిగాయి రేట్లు, అంటే ఎక్కడెక్కడ తక్కువ ధరకు దొరుకుతాయా అని ఆదివారం వస్తే పేపర్‌లో తల పెట్టి వెతుకుతుంటారు. కొన్ని ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న ధరలు కొంత బాధకు గురిచేస్తున్నా, మరికొన్ని ప్రాంతాల్లో స్థిరంగానే ఉన్నాయన్న విషయం సంతోషాన్నిస్తుంది. ఇల్లు కొనాలనే ఆలోచనకు ముందడుగు పడుతుంది.

ఇండిపెండెంట్ ఇల్లు కావాలంటే నగర శివార్లకు వెళ్లాలి. అదే అపార్ట్ మెంట్ అయితే నగరం మధ్యలోనే దొరుకుతుంది. రాబోయే రోజుల్లో ఐటీ రంగం మరింత విస్తరిస్తోంది. దీనికి అనుగుణంగానే కొత్త కొత్త వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రియల్ స్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. ఇప్పటికే ఈ ఏరియాలో వెలుస్తున్న విద్యాసంస్థలు, రెసిడెన్షియల్ పాఠశాలలు ప్లాట్ల బిజినెస్‌ని పెంచేస్తున్నాయి.

* రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ కడుతున్న ఇండిపెండెంట్ ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, విల్లాలకు కూడా బాగా డిమాండ్ పెరుగుతోంది.

* వరంగల్ జాతీయ రహదారి కూడా ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. రానున్న రోజుల్లో ఇక్కడ కూడా ఐటీ కంపెనీలు విస్తరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

* విమానాశ్రాయానికి చేరువలో ఉన్న ఆదిభట్లలో కూడా అభివృద్ధి ఎక్కువగా జరుగుతోంది.

* కరీంనగర్, సిద్ధిపేట వెళ్లే జాతీయ రహదారిలో కూడా బయోటెక్ ఫార్మాహట్‌లు, రిక్రియేషన్ క్లబ్‌లు, కీసరలో సైన్స్-నాలెడ్జి హబ్, మరికొన్ని ఐటీ హబ్‌లు వెలవనున్నాయి.

* బెంగుళూరు జాతీయ రహదారిలో రెండో దశలో మెట్రో ప్రతిపాదన ఉండడంతో ఇళ్ళ నిర్మాణం మరింత విస్తరించింది.

* నగర శివార్లలో ఐటీ కంపెనీల విస్తరణ ఇళ్ల నిర్మాణానికి సానుకూల అంశంగా దోహదపడుతోంది. ఈ ఒక్క అంశాన్ని బేరీజు వేసుకునే స్థిరాస్తి మార్కెట్ మరింత ఊపందుకుంది.

* ఏరియాను బట్టి అపార్ట్‌మెంట్లలో రేటు చ.అ రూ.2వేల నుంచి రూ.10వేల వరకు పలుకుతోంది. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకాస్త ఎక్కువే చెబుతున్నారు. ఇండిపెండెంట్ ఇళ్లు అయితే రూ.25 లక్షల నుంచి 50 లక్షల లోపు ఉన్నాయి. అప్పటికే డెవలప్‌మెంట్ అయితే మరికాస్త ఎక్కువే వుంటోంది.

* మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కూకట్‌పల్లి, మియాపూర్, చందానగర్, లింగంపల్లి ఏరియాల్లో కొత్త ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. అక్కడ ముందుగా బుక్ చేసుకుంటే మన బడ్జెట్‌లోనే మంచి ఇల్లు సొంతం చేసుకోవచ్చు.

* ఇక నగరం నడిబొడ్డు ప్రాంతాలైన బేగంపేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ వంటి ప్రాంతాల్లో స్థలాల ధరలు అధికంగా ఉన్నాయి. దీంతో ప్లాట్లు కూడా తక్కువ సంఖ్యలోనే దొరుకుతున్నాయి.

* మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్‌బీనగర్ ప్రాంతాల్లో కూడా నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతోంది. మరో నాలుగు నెలల్లో రాబోతున్న మెట్రో ఈ ప్రాంత వాసులకు మంచి వార్త కానుంది.

Tags

Read MoreRead Less
Next Story