WhatsApp Cashback: వాట్సప్‌లో క్యాష్ బ్యాక్.. ఇలా ట్రై చేయొచ్చు!

WhatsApp Cashback (tv5news.in)

WhatsApp Cashback (tv5news.in)

WhatsApp Cashback: ప్రస్తుతం క్యాష్ అనేవి చాలా తక్కువగా ఉపయోగిస్తున్నాం.

WhatsApp Cashback: ప్రస్తుతం క్యాష్ అనేవి చాలా తక్కువగా ఉపయోగిస్తున్నాం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లాంటివే క్యాష్ ప్లేస్‌ను ఆక్రమించేశాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న వారు వాట్సాప్ లేకుండా ఉండడం కష్టం. అలాగే ఆ స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ లాంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ యాప్స్ కూడా కంపల్సరీ అయిపోయాయి. అందుకే వాట్సాప్ కూడా మనీ ట్రాన్స్‌ఫర్ సౌలభ్యాన్ని ఇస్తూ కొత్త అప్డేట్‌ను ప్రవేశపెట్టింది.

ముందుగా కేవలం మెసేజ్‌లు పంపడానికి, ఫోటోలు, వీడియోలు, లొకేషన్ షేర్ చేయడానికి మాత్రమే ఉపయోగపడిన వాట్సాప్ రోజురోజుకీ రూపాంతరం చెందుతోంది. కొన్ని రోజుల క్రితం ఎవరి బిజినెస్‌ను వారు ప్రమోట్ చేయడానికి వాట్సప్ బిజినెస్ అనే అప్డేట్‌ను ప్రవేశపెట్టారు వాట్సాప్ టీమ్. తాజాగా వాట్సాప్‌లోనే పేమెంట్స్ చేసేలా వాట్సాప్ పేమెంట్స్ అప్డేట్‌ను పరిచయం చేశారు. ఈ అప్డేట్ అప్పుడే చాలామందికి ఉపయోగకరంగా మారింది.

వాట్సాప్ పేమెంట్స్ చేస్తున్నవారికి ఒక బంఫర్ ఆఫర్ ప్రకటించనున్నట్టు కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అదే వాట్సాప్ క్యాష్‌బ్యాక్. ఇప్పటికే వాట్సాప్ పేమెంట్స్ చేసిన పలువురికి క్యాష్‌బ్యాక్ లభించినట్టుగా వెల్లడించారు. అయితే ఇది కేవలం వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్‌ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) ఉపయోగిస్తు్న్న వారికే లభిస్తుందని కొందరి వాదన.

వాట్సాప్ క్యాష్‌బ్యాక్ రానివారు దాని యాజమాన్యానికి తెలియజేశారు. అయితే ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ 2.21.22.21, ఐఓఎస్‌ 2.21.220.14 బీటా వెర్షన్స్‌ ద్వారా పరీక్షించవచ్చని వాబీటాఇన్ఫో తెలిపింది. కొన్నిరోజుల్లో ప్రతీ స్మార్ట్ ఫోన్ యూజర్‌కు వాట్సాప్ పేమెంట్స్‌తో పాటు వాట్సాప్ క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులోకి రానుందని వారు అంటున్నారు.

వాట్సాప్ క్యాష్ బ్యాక్ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చినా అది ఎక్కువకాలం ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం పేమెంట్స్‌ను పెంచుకోవడానికి ఇది ఒక ప్రమోషన్ లాంటిదని వారు అంటున్నారు. గూగుల్ పే కూడా మొదట్లో ఇలాగే చేసిందని గుర్తుచేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story